Friday, May 10, 2024

మారిన కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం

తప్పక చదవండి
  • నేడు సీఎంగా ప్రమాణ చేయనున్న రేవంత్‌!
  • డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్కకి అవకాశం
  • ఆదివారం రాత్రి గవర్నర్‌ తమిళిసైని కలిసిన కాంగ్రెస్‌ నేతలు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : తెలంగాణలో విజయం సాధించిండంతో ఆసల్యం చేయకుండా వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారమే రాజ్‌భవన్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది. ప్రాథమిక సమాచారం మేరకు రేవంత్‌నే సిఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశం ఉండడంతో ఆయే తదుపర ఇసిఎం అని కాంగ్రెస్‌ సంకేతాలు ఇచ్చింది, 9న ప్రమాణం చేయాలని తొలుత నిర్ణయించినా ఆలస్యం సరికాదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో సిఎంగా రేవంత్‌, డిప్యూటి సిఎంగా భట్టి విక్రమార్క ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. 9న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు ఆదివారం రాత్రి గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన వివరాలు అందించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. 65 సీట్లలో గెలుపు సాధించడంతో అధికారం చేపట్టనుంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. దీంతో ఈరాత్రే సీఎల్పీ నేత ఎన్నుకోవడం కోసం పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సూచన మేరకు గెలిచిన ఎమ్మెల్యేలను గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇప్పటికే రేవంత్‌ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ హోటల్‌కు చేరుకున్నారు. ఇక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా వరుసగా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలంతా వచ్చాక సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసైను సీఎల్పీ బృందం కోరనుంది. ఇక సోమవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. సీఎం ఎంపిక విషయంలో ఏఐసీసీ సూచన మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. రేవంత్‌ సీఎంగా ఉంటే బాగుంటుందని మెజారిటీ ఎమ్మెల్యేలు సపోర్టు చేస్తున్నారు. అయితే రాజ్‌భవన్‌లో ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి రాహుల్‌, ప్రియాంక , సోనియాలు హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు సిఎల్సీ నేత ఎంపిక సోమవారం ఉదయం ఉంటుందని కాంగ్రెస్‌ సమచారం ఇచ్చింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు