Saturday, April 27, 2024

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

తప్పక చదవండి
  • ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలన్న ప్రహ్లాద్‌ జోషి

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐద రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరవాత ప్రారంభం అవుతు న్నాయి. దీంతో అధికార బిజెపిలో విజయోత్సాహం తొణికిసలా డుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రతిపక్ష పార్టీలను ఘాటుగా హెచ్చరించారు. పార్లమెంట్‌ సమావేశాలకు అంతరాయం కలిగిస్తే, ఆదివారం చవిచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని వార్నింగ్‌ ఇచ్చారు. అయితే అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నియమ,
నిబంధనల ప్రకారం ఇది జరుగాల్సి ఉందన్నారు. డిసెంబర్‌ 4 నుంచి 22 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ’క్యాష్‌ ఫర్‌ క్వెరీ’ మరో రెండు ఆరోపణలపై ఎథిక్స్‌ కమిటీ కీలక నివేదిక సమర్పించనున్నది. దీంతో పార్లమెంట్‌ సమావేశాలపై ఇది ప్రభావం చూపే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, ప్రతిపక్షాలను ప్రధానంగా కాంగ్రెస్‌ పార్టీని ముందుగానే హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని వార్నింగ్‌ ఇచ్చారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ చట్టాల మార్పుతోసహా 19 బిల్లులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడిరచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు