Wednesday, September 11, 2024
spot_img

మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం

తప్పక చదవండి
  • మధ్యప్రదేశ్‌లో మళ్లీ అధికారం
  • ప్రజల తీర్పును స్వాగతించిన ప్రధాని మోడీ
  • తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఖర్గే, రాహుల్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లోను ఆ పార్టీ ప్రభు త్వాలు ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు. ప్రజాతీర్పుకు శిరసువంచి నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మూడు రాష్టాల్ర ఫలితాలు సుపరిపాలన, అభివృద్ధి వైపే ప్రజలు కట్టుబడి ఉన్నట్లు సూచిస్తున్నా యన్నారు. బిజెపికి సడలని మద్దతు ఇచ్చిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజల సంక్షేమం కోసం
అవిశ్రాంతంగా పని చేయనున్నట్లు తెలిపారు. తీవ్రంగా కష్టపడిన పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అభివృద్ధి అజెండాను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో కార్యకర్తలు సక్సెస్‌ అయ్యారన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో పార్టీకి లభించిన ఫలితాలు నిరుత్సాహ పరిచాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో తమ పార్టీకి పట్ట కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ నాలుగు రాష్టాల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీ ఇచ్చిందని ఆయన అంటూ లక్షలాది మంది కార్యకర్తలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేశారు.’ తెలంగాణ ప్రజలనుంచి అందిన తీర్పుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. చత్తీస్‌గఢ్‌ ó్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో పార్టీకి ఓటు వేసిన వారికి కూడా కృతజ్ఞతలు. ఈ మూడు రాష్రాల్లో ఫలితాలు కచ్చితంగా నిరుత్సాహ పరిచాయి. అయితేఈ మూడు రాష్టాల్లో మేము శక్తివంచన లేకుండా పనిచేసి తిరిగి పుంజుంటాం’ అని ట్విట్టర్‌ వేదికగా ఖర్గే అన్నారు.మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాఃధీ అన్నారు. అయితే సైద్దాంతిక పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో ఘన విజయం సాధించడం ద్వారా హిందీ హార్ట్‌ల్యాండ్‌పై తన పట్టును బిజెపి మరింతగా బిగించింది. అయితే తెలంగాణలో అధికార బిఆర్‌ఎస్‌ను గ్దద్దెదించడంలో కాంగ్రెస్‌ కృతకృత్యమైంది.’ మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ ప్రజలు ఇచ్చిన తీర్పును మేము వినమ్రంగా అంగీకరిస్తున్నాం. అయితే సైద్దాంతిక పోరు కొనసాగుతుంది’ అని ఎక్స్‌లో హిందీలో చేసిన సోస్టులో రాహుల్‌ అన్నారు. తెలంగాణ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ’ప్రజల తెలంగాణ’ చేస్తామన్న హావిూని మేము కచ్చితంగా నెరవేరుస్తాం. తీవ్రంగా శ్రమించిన మద్దతు ఇచ్చిన పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు’ అని రాహుల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించడం ద్వారా తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టించారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ’ ఇది రాష్ట్రప్రజల, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతిఒక్క కార్యకర్త విజయం. తెలంగాణ ప్రజలకు నా హృదయపు లోతుల్లోంచి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల సుఖశాంతులు, ప్రగతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉంది’ అని ప్రియాంక ఓ ట్వీట్‌లో అన్నారు. ’మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌ రాష్టాల్ర ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష పాత్రను అప్పగించారు. ప్రజల నిర్ణయాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నాం’ అని కూడా ఆమె అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు