Monday, April 29, 2024

ఎన్నికల ప్రచారానికి బాబు రంగం సిద్దం

తప్పక చదవండి
  • 5 నుంచి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళిక
  • పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు
  • 7న అచంట సభకు భారీగా ఏర్పాట్లు

అమరావతి : ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించారు. దీనికోసం భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ ప్రణాళికలు సిద్దం చేసింది. జనవరి 5 నుంచి 29 వరకూ మొత్తం 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈనెల 18 మినహా మిగిలిన అన్ని రోజుల్లో సభలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి రోజూ రెండు సభలు జరగనున్నాయి. అయితే ఈ సభలకు రా.. కదలిరా అనే టీడీపీ నాయకులు పేరు పెట్టారు. ఇదే పేరుతోనే అన్ని సభలు నిర్వహిస్తామంటున్నారు. ప్రతి సభలో చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగనున్నాయి. ఈ బహిరంగ సభలకు కొన్ని చోట్ల పవన్‌ కళ్యాణ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది.టీడీపీ ఇదిలావుంటే అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 7న ఆచంటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సభా స్థలి ఏర్పాట్లపై టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మాజీ మంత్రి జవహర్‌, పీతల సుజాత ఆచంటకు చేరుకున్నారు. ఈ క్రమంలో నాయకులు, కార్యకర్తలకు టీడీపీ నేతలు దిశా నిర్దేశం చేసారు. ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం చంద్రబాబు పూరిస్తారని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు