Friday, May 3, 2024

కోకాపేటలో దౌర్జన్యకాండ..

తప్పక చదవండి
  • యథేచ్ఛగా కొనసాగుతున్న కబ్జాల పరంపర..
  • మొన్న రిటైర్డ్ ఐపీఎస్ భూమి.. నిన్న 5 ఎకరాల శివాలయం..
  • నేడు గోల్డ్ ఫిష్ అబోడ్ ల్యాండ్..
  • పట్టపగలే కాస్ట్ లీ ఏరియాలో బరితెగించి కబ్జాలు..
  • ఖతర్నాక్ స్కెచ్ వేసిన ఎమ్మెల్సీ చల్లా..
  • 100 మంది బౌన్సర్స్ తో దురాక్రమణ.. అడ్డువచ్చిన వారిపై దాడి..

హైదరాబాద్ : అతివిలువైన కోకాపేట ప్రాంతంలో కబ్జాల పరంపర కొనసాగుతోంది.. దౌర్జన్యకాండ చెలరేగుతోంది.. అధికార పార్టీ నాయకులు బరితెగించి మరీ కబ్జాలకు పాల్పడుతున్నారు.. ప్రయివేట్ సైన్యంతో దాడులు చేయిస్తూ భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.. మొన్న రిటైర్డ్ ఐపీఎస్ భూమి, నిన్న 5 ఎకరాల శివాలయం భూమి, నేడు గోల్డ్ ఫిష్ అబోడ్ భూమి.. ఒక్కటేమిటి ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు.. ఎదురుతిరిగిన వారిని అణచివేస్తున్నారు.. తాజాగా అధికార పార్టీ బీ.ఆర్.ఎస్. ఎమ్మెల్సీ చల్లా ఇక్కడ ఖతర్నాక్ స్కెచ్ వేశాడు.. పట్టపగలే కాస్ట్ లీ ఏరియాలో బరితెగించి మరీ కబ్జా భాగోతానికి తెగబడ్డాడు.. అడ్డొచ్చిన వారిని ఫుడ్ బాల్ ఆడుకున్నాడు.. ప్రైవేట్ బ్లున్సర్స్ ను పెట్టుకుని బీభత్సం సృష్టించాడు.. తాను కబ్జా చేస్తున్న సైట్ లో ఉన్న విలువైన సామన్లు ధ్వంసం చేశారు..
ఉన్న లేబర్ షెడ్స్ ను బలవంతంగా తొలగించారు.. పైగా ఆ సంఘటనను వీడియోలు తీస్తున్న మీడియాపై కనికరం లేకుండా దౌర్జన్యం జరిపారు..

ఎన్.టీవీ, ఆర్. టీవీ జర్నలిస్టుల సెల్ ఫోన్ లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు.. సంబంధిత ఛానల్ ఓనర్లకు ఫోన్ చేసి జర్నలిస్టులను బలవంతంగా తిరిగి పంపించారు.. కాగా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి తీరుతో తీవ్ర భయాందోళనకు గురైయ్యారు బాధితులు. సర్వే నెంబర్ 85లో చుట్టు రేకులతో పొజిషన్ తీసుకునే ప్రయత్నం చేశారు.. ఇక్కడ భూమి ఎకరం రూ. 100 కోట్లకు పైగా పలకడమే శాపంగా మారిందని వాపోతున్నారు బిల్డర్స్.. రూ. 4 కోట్లతో ఇన్వెస్టర్స్ గా వచ్చి రూ. 1500 కోట్ల ప్రాజెక్ట్ కు ఎసరు పెట్టాడు చల్లా.. 2013లో సెల్ డీడ్, డీఏజీపీలు జరిగాయి.. కాగా రేట్లు పెరగడంతో తనకున్న అధికారబలంతో కబ్జాకు ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు.. ఇలాంటి కబ్జాల తీరుపై ఎన్నోసార్లు హైకోర్టు సిరియస్ అయ్యింది.. కాగా ఇటీవలే జీడిమెట్ల కబ్జా తీరుపై ఇటీవలే శేరిలింగంపల్లి ఎమ్మెల్యేకి హైకోర్టు నోటీస్ లు కూడా జారీ చేసింది.. అయినా సరే భయపడకుండా బరితెగించి కబ్జాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వీరికి అధికార ప్రభుత్వం అండదండలు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు విశ్లేషకులు.. ఇలాంటి వ్యవహారాలను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురికావలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు