Wednesday, May 8, 2024

43 మందితో బీఎస్పీ రెండో జాబితా విడుదల

తప్పక చదవండి
  • 26 మంది బీసీలు, ఏడుగుర ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలకు టిక్కెట్‌
  • వరంగల్‌ ఈస్ట్‌ టిక్కెట్‌ ట్రాన్స్‌ జెండర్‌కు కేటాయింపు
  • సిర్పూర్‌ నుంచి పోటీ చేస్తున్న తెలంగాణ చీఫ్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా కాంగ్రెస్‌ రెండు జాబితాల్లో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీజేపీ కూడా రెండో జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. బీఎస్పీ తన రెండో జాబితాను విడుదల చేసింది. 20 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. ఇప్పుడు 43 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది. కాగా.. ఈ లిస్టులో సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్న కామారెడ్డి స్థానానికి కూడా బీఎస్పీ తన అభ్యర్థిని ఉడతావర్‌ సురేష్‌ గౌడ్‌ ను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధినేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ సిర్పూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

బెల్లంపల్లి(ఎస్సీ) – జాడీ నర్సయ్య
ఆసిఫాబాద్‌ (ఎస్టీ) – కనక ప్రభాకర్‌
మంచిర్యాల – తోట శ్రీనివాస్‌
బోథ్‌ (ఎస్టీ) – మెస్రాం జంగుబాపు
కోరుట్ల – నిశాంత్‌ కార్తీకేయ గౌడ్‌
కామారెడ్డి – ఉడతావర్‌ సురేష్‌ గౌడ్‌
సిరిసిల్ల – పిట్టల భూమేష్‌ ముదిరాజ్‌
వేములవాడ – గోలి మోహన్‌
జగిత్యాల – బల్కం మల్లేష్‌ యాదవ్‌
రామగుండం – అంబటి నరేష్‌ యాదవ్‌
హుజూరాబాద్‌ – పల్లె ప్రశాంత్‌ గౌడ్‌
దుబ్బాక – సల్కం మల్లేష్‌ యాదవ్‌
మహుబూబ్‌నగర్‌ – బోయ స్వప్న శ్రీనివాసులు
కొడంగల్‌ – కురువ నర్మద కిష్టప్ప
దేవరకద్ర – బసిరెడ్డి సంతోష్‌ రెడ్డి
అచ్చంపేట (ఎస్సీ) – మెత్కూరి నాగార్జున
మక్తల్‌ – వర్కటన్‌ జగన్నాధ్‌ రెడ్డి
కల్వకుర్తి – కొమ్ము శ్రీనివాస్‌ యాదవ్‌
కొల్లాపూర్‌ – గగనం శేఖరయ్య
షాద్‌ నగర్‌ – పసుపుల ప్రశాంత్‌ ముదిరాజ్‌
హుజూర్‌నగర్‌ – రాపోలు నవీన్‌
మునుగోడు – అందోజు శంకరాచారి
వరంగల్‌ ఈస్ట్‌ – చిత్రపు పుష్పతలయ
మహబూబాబాద్‌ – గుగులోత్‌ శంకర్‌ నాయక్‌
పాలకుర్తి – సింగారం రవీంద్రగుప్త
స్టేషన్‌ ఘన్పూర్‌ (ఎస్సీ) – తాళ్లపల్లి వెంకటస్వామి
నర్సంపేట – డా.గుండాల మధన్‌ కుమార్‌
వర్దన్నపేట (ఎస్సీ) – డా.వడ్డేపల్లి విజయ్‌ కుమార్‌
డోర్నకల్‌ (ఎస్టీ) – గుగూలోత్‌ పార్వతీనాయక్‌
ములుగు (ఎస్టీ) – భూక్యా జంపన్న నాయక్‌
భద్రాచలం (ఎస్టీ) – ఇర్పా రవి
పినపాక (ఎస్టీ) – వజ్జ శ్యామ్‌
అశ్వారావుపేట్‌ (ఎస్టీ) – మడకం ప్రసాద్‌
మధిర (ఎస్సీ) – చెరుకుపల్లి శారద
చేవేళ్ల (ఎస్సీ) – తొండుపల్లి రాజా అలియాస్‌ రాజమహేంద్రవర్మ
పరిగి – యంకెపల్లి ఆనంద్‌
రాజేందర్‌ నగర్‌ – ప్రొ. అన్వర్‌ ఖాన్‌
ఉప్పల్‌ – సుంకర నరేష్‌
మలక్‌ పేట్‌ – అల్లగోల రమేష్‌
చంద్రాయణగుట్ట – మూల రామ్‌ చరణ్‌ దాస్‌
నాంపల్లి – మౌలానా షఫీ మసూదీ
ఇబ్రహీంపట్నం – మల్లేష్‌ యాదవ్‌
శేరిలింగంపల్లి – ఒంగూరి శ్రీనివాస్‌ యాదవ్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు