Sunday, May 19, 2024

బిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో పేదలకు మేలు : నిరంజన్‌రెడ్డి

తప్పక చదవండి

వనపర్తి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని, మ్యానిఫెస్టోను పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని వనపర్తి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ, కాంగ్రెస్‌ యువకులు, బుద్దారం మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, మాజీ ఎంపీటీసీ శేఖర్‌ గౌడ్‌, ఎంపీటీసీ విష్ణు, సర్పంచ్‌ నీలకంఠ ఆధ్వర్యంలో 20 మంది, చెన్న రాములు ఆధ్వర్యంలో అంజనగిరి, జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కేంద్రం లోని హరిజన వాడలో టీడీపీ సీనియర్‌ నాయకుడు గంధం బాలపీరుతో పాటు 100 మంది నాయకులు వేరువేరుగా మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు జరగాలంటే బీఆర్‌ఎస్‌ను గెలిపించాలన్నారు. పాత, కొత్త నాయకులు అందరు కలిసి కట్టుగా పని చేసి బీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ పాకనాటి కృష్ణయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు