Monday, December 4, 2023

కెసిఆర్‌ పాలనలో ఆంధ్రావాళ్లు కూడా ఫిదా : లింగాల కమలారాజ్‌

తప్పక చదవండి

ఖమ్మం : సీఎం కేసీఆర్‌ సుపరిపాలన చూసి ఆంధ్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తాము కూడా తెలంగాణలో ఉంటే బాగుండునని కోరుకుంటున్నారని జెడ్పీ చైర్మన్‌, మధిం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగాల కమల్‌ రాజ అన్నారు. మంగళవారం మధిరలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అడగకపోయినా సీఎం కేసీఆర్‌ నియోజకవర్గానికి వంద పడకల దవాఖానను మంజూరు చేశారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మధిరను మున్సిపాలిటీ చేసి గాలికి వదిలేస్తే సీఎం కేసీఆర్‌ కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు