Tuesday, May 14, 2024

“అన్ని దానాలలో కెల్లా రక్త దానం మిన్న”

తప్పక చదవండి
  • అక్టోబర్ 1 న జాతీయ రక్త దాన దినోత్సవం సందర్భంగా..

రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమయాలలో శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీన జాతీయ స్వచ్చంధ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు. 1975 సంవస్త్సరము లో స్వరూప కృష్ణన్,డా.జె.జి.జొలిల చొరవతో ఈ రక్త దాన దినోత్సవం ప్రారంభం అయినది. రక్త దానం చేయాలని ప్రోత్సహిస్తూ రక్త దానం ఆవశ్యకతను తెలియ పరచడం రక్తదాన దినోత్సవం ప్రాముఖ్యత గా చెప్పవచ్చు.నేటికీ గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై ప్రజలకు యువతకు అవగాహన లేదు. రక్త దానం చేస్తే నీరసించి పోతామని, బలహీనపడి పోతామని అపోహ ప్రజల్లో బలంగా ఉంది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, రెడ్క్రాస్ లాంటివి గ్రామాల్లో ,పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తంని సేకరిస్తున్నారు. ముఖ్యంగా యువత మాత్రం రక్తదానం అంటేనే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఒకవేళ స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారికి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల నుండి ప్రోత్సాహం లేకపోవడంచే రక్తదానం చేయడానికి అనేకమంది వెనుకంజ వేస్తున్న సంఘటనలు కోకొల్లలు..

రక్త దానము ఎవరు చేయవచ్చు :
ప్రతి ఆరోగ్యవంతుడి లో సుమారు 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు ఓమారు అనగా సంవత్సరానికి నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చు. 45 కిలోల బరువు పైన ఉన్న వారు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి నుండి రక్తదాత 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తదానం చేసే వ్యక్తిని వైద్యుల సంరక్షణలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హైపటైటిస్ బి, హెచ్ ఐ వి ,రక్తహీనత ,బలహీనత, షుగర్ ,దీర్ఘకాలిక వ్యాధులతో, బాధపడేవారు రక్తదానం చేయడానికి అనర్హులు. ఒకవేళ తెలియక చేసి రక్తం ఉపయోగపడదు. రక్తదానం చేసిన వారికి పూర్తిస్థాయిలో రక్తం 21 రోజుల్లో తిరిగి ఉత్పత్తి అవుతుంది. రక్తంలో మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి 4 నెగటివ్ గ్రూపులు నాలుగు పాజిటివ్ గ్రూపులు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవో నెంబర్ 184 ద్వారా ఆ రోజు స్పెషల్ క్యాజువల్ మంజూరు చేయబడుతుంది. ప్రపంచంలో అధిక మొత్తంలో ఓ పాజిటివ్ వారే అధికంగా ఉన్నారు. ఒక యూనిట్ సుమారు 500 మిల్లీ లీటర్లు రక్తంలో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్త దానం చేసే వారు మిగతా వారికన్నా చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. రక్త గ్రూపులు దేశవ్యాప్తంగా వాని శాతం ఓ పాజిటివ్ 46శాతం, ఏ పాజిటివ్ 37 శాతం, బి నెగిటివ్ 8 శాతం, ఏ నెగిటివ్ 4 శాతం, నెగిటివ్ 2%, ఏ బి నెగిటివ్ ఒక శాతం.ఒక శాతం ఏ బి పాజిటివ్. ఒక శాతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రెడ్ క్రాస్ అనే అంతర్జాతీయ సంస్థ, మరియు ఆయా జిల్లాల ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న రక్తనిధి కేంద్రాలు అధిక సంఖ్యలో రక్తాన్ని సేకరిస్తున్నాయి. ప్రతి ఏటా వందలాది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ వేల యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో రక్తదాన కేంద్రాలు ఉన్నాయి. అనేక మంది తమ జన్మదినాలు, పెళ్లి రోజును పురస్కరించుకొని కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ తమ మిత్రులు, బంధువులు, సన్నిహితుల ద్వారా రక్తాన్ని సేకరిచాటుకున్నారు.బ్లడ్ బ్యాంకు కులకు అందజేస్తూ తమ దాతృత్వంతో,ఉదారతను చాటుతున్నారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులలో కల్తీ రక్తమును విక్రయిస్తున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి.రెడ్ క్రాస్,ప్రభుత్వ రక్త నిధి కేంద్రాలలో నామమాత్రపు డబ్బులతో రక్తమును విక్రయిస్తున్నారు. సమాజంలో ఇప్పటివరకు రక్త దానం చేయని వారు అధిక సంఖ్యలో ఉన్నారు. రక్తదానం చేయడం అంటే ఓ మనిషిని బ్రతికించేధి. రక్తంఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది.రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు కరపత్రాలు, గోడ పత్రికలు, సదస్సుల ద్వారా గ్రామ ప్రజలు యువతలో, మహిళా సంఘాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. రక్త దానము మించిన దానం లేదు అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేయాలి. అధిక సార్లు రక్తదానం చేసిన వారికి విద్య, ఉద్యోగాలలో ప్రమోషన్లలో సముచిత స్థానం కల్పించాలి .రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి..ఆయా గ్రామాల,పట్టణాల యువత,స్వచ్చంధ సంస్థలు,దేశ వ్యాప్తంగా లక్షలాది రక్త దాన శిబిరాలు నిర్వహించి రక్తంని సేకరించి కరొనా రోగులకు అందించిన సంధర్భములు వున్నాయి.ప్లాస్మా దానం చేసిన వారు వున్నారు.మనం కూడా రక్త దానం యొక్క ప్రయోజనాలు, ఆవశ్యకత ని ప్రతి ఒక్కరికి వివరించుధాం.రక్త దానం చేయడాకిని ముందుకు వద్దాం. రక్త దాతలను ప్రభుత్వం గుర్తించాలి.

  • కామిడి సతీష్ రెడ్డి, 9848445134.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు