Monday, October 2, 2023

పోలీసులు కిషన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..

తప్పక చదవండి
  • ముఖ్యమంత్రి కెసిఆర్ మోనార్క్ లా వ్యవహరిస్తున్నారు : బండి సంజయ్..

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్ళను అణిచి వేస్తున్నారు… కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే తప్పేంటి? డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని ఇచ్చారు? ఎన్ని కట్టిచ్చారు? పీ.ఎం.ఏ.వై. కింద ఇచ్చిన ఇళ్ళను పూర్తి చేశాం అని కేంద్రానికి నివేదిక ఇచ్చిన కేసీయార్ లబ్ధిదారుల లిస్ట్ ఎందుకు ఇవ్వడం లేదని కేంద్రo ప్రశ్నిస్తే ఎందుకు స్పందించడం లేదు? మీరు కట్టిచ్చిన ఇళ్ళను చూసేందుకే బిజెపి నాయకులు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారు? అరెస్టులు, గృహ నిర్బందాలు కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం.. డబుల్ బెడ్ రూం ఇల్లు అక్రమ దందాలకు నిలయంగా మారాయి. కెసిఆర్ ఇకనైనా మోనార్క్ బుద్దులు మానుకోవాలి. అరెస్టులు చేసినంత మాత్రాన బిజెపి వెనక్కి పోదు.. ఎంపిలపై జరిగిన అరెస్టుల పై పార్లమెంట్ లో ప్రివిలైజ్ నోటీసులు కూడా ఇచ్చాము.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు