Friday, May 10, 2024

ప్రభుత్వ వైఫల్యమా…అధికారుల నిర్లక్ష్యమా….?

తప్పక చదవండి
  • ప్రాణాలు తీస్తున్న చేవెళ్ల రోడ్డు, పట్టించుకోని అధికారులు
    శంకర్‌ పల్లి : మండలంలో ఆర్‌అండ్‌బి రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. నడిరోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలను శంకిస్తున్నాయి. ద్విచక్ర వాహన చోదకులు, ఆటోలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవటంలేదు. దీనికి తోడు భారీ వర్షాలతో రోడ్లు మరింత ప్రమాదభరితంగా తయారయ్యాయి. శంకర్‌ పల్లి చేవెళ్ల మార్గంలో ప్రధాన రహదారి దుస్థితి ప్రయాణికులను బయపెడుతోంది.చేవెళ్లశంకర్‌ పల్లి వికారాబాద్‌ మార్గంలో పత్తే పూర్‌ బ్రిడ్జి దగ్గర రోడ్డు పూర్తిగా దెబ్బతింది.ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది.ఎల్వేర్తి, టంగుటూరు, ఎనికేపల్లి, చేవెళ్ల, పర్వేద, అంతప్ప గూడ,చుట్టుపక్కల గ్రామాల ఆర్టీసీ బస్సులు, ఇసుక టిప్పర్లు, ఇటుక రాయి లోడు లారీలు, ట్రాక్టర్లు, ఆటోలు, వివిధ విద్యా సంస్థల వాహనాలు నిత్యం వేలకొలది ప్రయాణిస్తుంటాయి. ఈ మార్గంలో దీర్ఘకాలికంగా రోడ్డు నిర్మాణా నికి గాని, మరమ్మ తులగాని నోచుకోలేదు. ఏదైనా ప్యాచ్‌ వర్కులు చేసినా చేశామనే పేరుకేగాని, ఏ మాత్రం ప్రయోజనం లేదు. దీంతో కొన్నిచోట్ల రోడ్డు ఇరువైపులా కుంగిపోతే, మరి కొన్నిచోట్ల నడిరోడ్డుపై గోతులు పడ్డాయి. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనపుడు అధికా రులు స్పందించకపోవటంతో గ్రామస్తులు ఆ గోతుల్లో మొర్రం పోయించారు. వర్షాలకు మోర్రం పూర్తిగా కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి.రోడ్లు ఎంత ప్రమాద భరితంగా ఉన్నా ఆర్‌ అండ్‌ బి అధికారులకు మాత్రం చీమకు ట్టినట్టు కూడా ఉండదు.నిత్యం ఇదే మార్గంలో తిరిగే ప్రజాప్రతిని ధులు కూడా రోడ్డు మరమ్మతులపై స్పందించరు. కనీసం తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టరూ,చేవెళ్ల రోడ్డులో రోడ్డు దెబ్బతినడంతో వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. మూడు నెలల క్రితం పర్వేద గ్రామానికి చెందిన మహిళ రోడ్డు పై ఉన్న గుంతల కారణంగా ద్విచక్ర వాహనం కుదుపులకు కిందపడి పోయింది. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఇట్లా ఈ రోడ్డులో ప్రయాణం చేసిన వారు చాలామంది కుదుపులకు వెన్నుపూస, నడుం నొప్పులతో బాధపడుతూ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. ఇంకా ఎన్ని ప్రమాదాలు జరగాలో, ఎంత మంది ప్రాణాలు పోతే అధికారులు స్పందిస్తారో? అని ప్రయా ణికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణానికిగాని, మరమ్మతులకుగాని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు