Friday, May 3, 2024

గజపడుగు హరి ప్రసాద్ జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి

తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌ గుజపడుగు హరిప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.. శుక్రవారం రోజు కరీంనగర్ లో గుంజపడుగు హరిప్రసాద్ మిత్ర బృందం, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్మదిన కార్యక్రమంలో వారు పాల్గొని జన్మదిన కేకును కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ఎంతో ప్రేమతో పాలు పంచుకున్న వాళ్ళందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ.. మీ ప్రేమ అభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని.. మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని వారు అన్నారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ స్టేడియం వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు కన్నం శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు అంబేద్కర్ స్టేడియం వాకర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెమసారం తిరుపతి మాట్లాడుతూ.. గుంజపడుగు హరిప్రసాద్ జన్మదిన సందర్భంగా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని జైలు జీవితం గడిపిన ఉద్యమకారుడు గుంజపడుగు హరిప్రసాద్ అని వారు రాజకీయంగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని కోరడం జరిగింది. అదే విధంగా తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక వ్యవస్థాపకులుగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రవ్యాప్తంగా నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తూ.. నాయీ బ్రాహ్మణులకు రావలసినటువంటి నిధుల విధుల విషయంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నారని వారు అన్నారు.. అదే విధంగా కరీంనగర్ జిల్లాలో నాయీబ్రాహ్మణ విద్యార్థి హాస్టల్ వసతి గృహ నిర్మాణంలో వారు క్రియాశీలక పాత్ర పోషించి ఈ రోజు నాయీబ్రాహ్మణుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని వారు అన్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐక్యవేదిక కార్యదర్శి ముత్యాల లక్ష్మణ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గర్శకుర్తి శంకర్, రాష్ట్ర నాయకులు శ్రీరాముల బాల సురేందర్, జిల్లా నాయకులు శ్రీరాముల రమేష్, అదే విధంగా హాస్పిటల్ ఎండి గొట్టె మహేష్, వైస్ చైర్మన్ సాధవేని వినయ్, మిర్యలకౌర్ మునీందర్, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా నాయకుడు స్వయంకృషి గడ్డం వీరేందర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరాముల శ్రీకాంత్, జిల్లా గర్శకుర్తి విద్యాసాగర్, గుంజపడుగు పవన్ కుమార్, కొత్వాల అశోక్, వినీత్, కరీంనగర్ మండల అధ్యక్షుడు చెరుకు రమేష్, తంగళ్ళపల్లి గణేష్, కొత్తకొండ శ్రావణ్, ఠాకూర్ సాయిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు