Friday, May 17, 2024

ప్రధాని మోడీ ఎన్నికల శంఖరావ సభను విజయవంతం చేద్దాం..

తప్పక చదవండి
  • మోడీ సభ తెలంగాణ ప్రజలకు భరోసానిచ్చే సభ..
  • ప్రతి బూత్ స్థాయి కార్యకర్త సభకు స్వచ్ఛందంగా తరలి వెళ్ళాలి..
  • బీజేపీ మాజీ నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి పిలుపు..

ఈరోజు వరంగల్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలను సాకారం చేసే విధంగా ఉండబోతోందని బీజేపీ మాజీ నగర అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి శుక్రవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 2023 చివరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ సభ ఎన్నికల శంఖరావం పూరించే సభగా ఉండబోతోందని, అందుకే ప్రతి బూత్ స్థాయి కార్యకర్త మొదలు పార్టీ అభిమానులు, శ్రేయోభిలాషులు, జాతీయవాదులందరు స్వచ్ఛందంగా తరలి వెళ్లాలని ఉదయం 10 గంటలకు సభ స్థలి వద్ద ఉండే విధంగా సమయ పాలన పాటించే విధంగా కార్యాచరణ చేసుకొని వెళ్లి సభను విజయవంతం చేయాలని మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభ కోసం తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నదని, తెలంగాణలో నివసిస్తున్న బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, అలాగే ఆర్థికంగా చితికిపోయిన కడు పేద కుటుంబాల జీవన శైలిని మార్చే విధంగా, నిరుద్యోగ యువత ఆశలకు అనుగుణంగా ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా సభలో మోడీ ప్రసంగం ఉంటుందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా, నూతన రాష్ట్ర అధ్యక్షులకు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టకుండా సహనంతో ఉండి పార్టీ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని, పార్టీ సిద్దాంతం కోసం పని చేసే కార్యకర్తలు పార్టీ ఎదుగుదల కోసం పని చేయాలని, వ్యక్తులను కేంద్రంగా చేసుకొని పని చేస్తే వ్యక్తికే లాభం చేకూరుతుందే కానీ పార్టీకి లాభం చేకూరాదనే విషయం గుర్తుంచుకోవాలని మహేందర్ రెడ్డి కార్యకర్తలకు బేతి మహేందర్ రెడ్డి కోరారు. అలాగే నూతనంగా నియామకమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి మరియు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మెన్ ఈటల రాజేందర్ లకు కరీంనగర్ నియోజకవర్గం పక్షాన బేతి మహేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు తాడూరి బ్రహ్మం, గుడిపాటి జితేందర్ రెడ్డి, వడ్డేపల్లి సుమన్, బలుసుల అనిల్, కందుకూరి వెంకటేష్, కంకటి సాగర్, రవీందర్, అవినాష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు