Saturday, May 18, 2024

ఓ మహిళా మేలుకో..నీ దేశాన్ని ఏలుకో..

తప్పక చదవండి
  • మహిలందరీకి శుభాకాంక్షలు : సబితా ఇంద్రారెడ్డి..
  • పార్లమెంట్‌లో మహిళ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తంచేసిన విద్యాశాఖ మంత్రి

మహేశ్వరం : మహిళ బిల్లు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో బి ఆర్‌ ఎస్‌ పార్టీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీలో తీర్మానం చేయటంతో పాటు బిల్లు ఆమోదం కోసం వివిధ రకాలుగా బిఆర్‌ఎస్‌ పార్టీ చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని,ప్రత్యేక పార్లమెంటు సమావేశాల సందర్భంగా సైతం బిల్లు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రికి లెటర్‌ రాసారని అన్నారు.ఎమ్మెల్సీ కవిత ఎంపీ గా ఉన్నప్పటి నుండి దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలను ఏకం చేస్తూ చేసిన ఉద్యమం కూడా మహిళ లోకం మరిచిపోదన్నారు.ఇది యావత్‌ మహిళ లోకానికి దక్కిన గౌరవం అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థలతో పాటు,మార్కెట్‌ కమిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ కే దక్కుతుందన్నారు.బిల్లు ఆమోదం కొరకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి యావత్‌ మహిళల తరుపున మంత్రి ధన్యవాదాలు తెలిపారు.మహిళ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి,బిల్లుపై మాట్లాడిన సబ్యులకు,బలపర్చిన సభ్యులందరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.మహిళ బిల్లుపై వివిధ దశల్లో ఉద్యమం చేసిన జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.33 శాతం రిజర్వేషన్ల కల్పనతో మహిళలు ఆకాశంలోనే కాదు అవకాశాల్లోను అగ్రభాగాన ఉంటారని,ఈ సందర్భంగా మహిలందరీకి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు