Thursday, May 2, 2024

అమిత్‌ షాతో బండి సంజయ్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాను కలిశారు. ఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోం మంత్రి కార్యాలయంలో సోమవారం వీరిద్దరూ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బండి, తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులను అమిత్‌ షాకు బండి వివరించారు. పార్టీలో తన వర్గాన్ని పక్కన పెట్టడం పట్ల బండి సంజయ్‌ హోం మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీకి అందించిన సేవలను గుర్తించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలాగే, గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కూడా అమిత్‌ షాని బండి సంజయ్‌ కోరినట్టు తెలుస్తోంది. వీటిపై స్పందించిన అమిత్‌షా.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని, మీడియా వద్ద పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి కోల్పోయిన అనంతరం కేంద్ర మంత్రిని బండి కలవడం ఇదే తొలిసారి కావడంతో భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు