Friday, May 17, 2024

సంత సమర్పయామి..!

తప్పక చదవండి
  • నిరుపయోగంగా గ్రామ సంత ప్రాంగణం..
  • ఎవరి స్వలాభం కోసం నిర్మించారు..?
  • రైతులకు అనుకూలంగా లేని చోట నిర్మాణం..
  • ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం..
  • గ్రామసంత ప్రాంగణం ముందు కంచలేని కరెంటు ట్రాన్స్‌ ఫార్మర్స్‌..
  • ప్రజల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యులు..?
  • నిలదీస్తున్న కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీటీసీ తలారి మైసయ్య..

శంకర్‌ పల్లి : రంగారెడ్డి జిల్లా, శంకర్‌ పల్లి మండలం, జన్వాడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి శాఖలో భాగంగా ఈ గ్రామంలో 12.25 లక్షలతో గ్రామ సంత ప్రాంగణం 2020 లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించారు. ఈ గ్రామసంత ప్రాంగణం రైతులకు అనుకూలంగా ఉన్న చోట నిర్మాణం చేపట్టలేదని మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ ఎంపిటిసి తలారి మైసయ్య అన్నారు.12 లక్షల 25 వేల రూపాయలతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు.. కానీ ఈ ప్రాంగణం ద్వారా రైతులకు ఏమి మేలు లేదని, ఒక్క మాట కూడా రైతులను అడగకుండా బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వారి ఇష్టం వచ్చినట్టు కట్టి.. మా ఆధ్వర్యంలో ఈ గ్రామసంత ప్రాంగణం నిర్మించాం అని చెప్పుకోవడానికి తప్ప దీని ద్వారా మేలు జరిగేది లేదని, రైతులను అడిగి ఇవే డబ్బులతో వేరే ప్రదేశం (జాగా) లో నిర్మిస్తే బాగుండేదని, బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రైతుల పట్ల సవ్యంగా ఆలోచిస్తే.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి బాధలే ఉండేవి కావని.. అసలే వరి కమిషన్ల కోసం ఈ ప్రాంగణం నిర్మించారని, ఇదే ప్రాంగణం ముందు కంచ లేకుండా కరెంటు ట్రాన్స్‌ ఫార్మర్స్‌ ఉన్నాయని ఈ ట్రాన్స్‌ ఫార్మర్స్‌ తో గ్రామ ప్రజల ప్రాణాలు తీయడానికే విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ ట్రాన్స్‌ ఫార్మర్స్‌ ను ఇక్కడి నుండి తొలగిస్తారా..? లేక వీటికి కంచె ఏర్పాటు చేస్తారా లేదా..? అని ప్రశ్నించారు.. అనేక విధాలుగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు