Wednesday, October 9, 2024
spot_img

అమెరికా నౌకాదళానికి తొట్టతొలి మహిళా చీఫ్‌

తప్పక చదవండి
  • లీసా ఫ్రాంచెట్టి పేరు సూచించిన జో బైడెన్‌
    వాషింగ్టన్‌ : అమెరికా నావికా దళానికి నూతన అధిపతిగా అధ్యక్షుడు జో బైడెన్‌, లీసా ఫ్రాంచెట్టి పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్‌ సెనేట్‌ గనుక బైడెన్‌ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్‌ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర సృష్టిస్తారు. జో బైడెన్‌ ప్రతిపాదన అయితే చేశారు కానీ అందుకు యూఎస్‌ సెనేట్‌ ఆమోదించాల్సి అవసరముంది. అధికార యంత్రాంగాన్ని నియమించడంలో అమెరికా కాంగ్రెస్‌ కు భారత పార్లమెంటు కంటే విశేష అధికారాలుంటాయి. కాకపొతే ఈ ప్రతిపాదనకు రిపబ్లికన్లు కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మాట్లాడుతూ.. లీసా ఫ్రాంచెట్టి గత 38 సంవత్సరాలుగా ఆమె స్వీకరించిన ప్రతి పదవికి వన్నె తీసుకొస్తూ అమెరికా నావికా దళానికి విశేష సేవలందించారు. ప్రస్తుతం ఆమె అమెరికా నావికా దళానికి వైస్‌ చీఫ్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లీసా అమెరికా నౌకాదళంలో ఫోర్‌ స్టార్‌ అడ్మిరల్‌ గా నియమింపబడిన రెండో అధికారి. ఒకవేళ ఆమె నియామకంపై సెనెట్లో గ్రీన్‌ సిగ్నల్‌ వస్తే అమెరికా నావీకి చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరించిన తొట్టతొలి మహిళగా నిలుస్తారన్నారు. రిపబ్లికన్లకు అమెరికా నౌకా దళం పేరు ప్రఖ్యాతలు గురించి, దాని సామర్ధ్యం గురించి పరిజ్ఞానం ఉందనే అనుకుంటున్నాను. దేశఖ్యాతిని మరింతగా ఇనుమడిరపజేసే విధంగా తొలి మహిళా అడ్మిరల్‌ నిర్ణయాన్ని వారు ఆమోదిస్తారని అనుకుంటున్నానని అన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు