Friday, May 3, 2024

సూర్యాపేట మాతా శిశు కేంద్రంలో శిశువు మృతి

తప్పక చదవండి
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బంది
  • కాళ్ళు మొక్కిన కనికరించని వైద్యులు
  • చావు కబురు సల్లగా చెప్పిన హాస్పటల్‌ సిబ్బంది
  • నిర్లక్ష్యం వహించిన వైద్యురాలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

సూర్యాపేట : వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రాల్లోని మాతా శిశు కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌ పహాడ్‌ మండలం గాజుల మల్కాపురం గ్రామానికి చెందిన వనపట్ల మానసను, బుధవారం సాయంత్రం డెలివరీ కోసం జిల్లా కేంద్రం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకు రాగా, డ్యూటీ డాక్టర్‌ చూసి డెలివరీకి ఇంకా టైం ఉంది అంటూ పదే పదే చెప్తూ నిర్లక్ష్యం వహించారని, కడుపు తో ఉన్న మహిళ నొప్పులకు తట్టుకోలేక ,డెలివరీ చేయండి అంటూ కుటుంబ సభ్యులు డాక్టర్‌ కాళ్ళ మీద పడి ప్రాధేయపడిన కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేసారు.గురువారం తెల్లవారు జామున ఐదున్నర గంటల సమయంలో శిశువు మంచిగానే ఉంది అంటూ చెప్పిన సిబ్బంది, ఆ తర్వాత శిశువు మృతి చెందిందని తెలిపారన్నారు.ఉదయం మృతి చెందిన శిశువును మాకు చూపించలేదని, మా చేతికి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.డ్యూటీ డాక్టర్‌, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే మా ఆడబిడ్డ మృతి చెందిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్‌, సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతు న్నారు. గత పది రోజుల క్రితం కూడా ఓ మహిళ డెలివరీ కోసం ఆస్పత్రికి తీసుకురాగా, ఆమెకు డెలివరీ చేయకుండా వైద్యులు నిర్లక్ష్యం వహించి బాబు మృతికి కారణమ య్యారని, పుట్టిన బాబు నాలుగు కిలోల పైనే ఉన్నాడంటూ స్థానికులు చెప్తున్నారు. ఇలా మాతా శిశు కేంద్రాల్లో ఏదో ఒక సంఘటన జరగడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు, సంబంధిత శాఖ అధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో, ఇందులో పనిచేస్తున్న వైద్యులు సిబ్బంది ఆడిరది ఆటగా పాడిరది పాటగా కొనసాగుతూ వస్తుంది. ఇలానే నిర్లక్ష్యంగా వైద్యం చేస్తే వీరి పంట ఎన్నడూ పండుద్దంటూ అక్కడున్నవారు చెప్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు