Tuesday, October 15, 2024
spot_img

కన్నేస్తే కతం

తప్పక చదవండి
  • ప్రభుత్వం మారగానే కబ్జాలు షురూ
  • రూ.6కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు
  • భూ బకాసురులకు బడా నాయకుల అండ
  • 14వవార్డులోని ప్రభుత్వభూమిలో వెలసిన రూములు
  • ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న ప్రజలు

కొత్తగూడెం : ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా కావాల్సిందే. గతప్రభుత్వ హాయంలో కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని 36వార్డుల్లో కబ్జాలకు గురవుతున్నా ప్రభుత్వ భూములను రక్షించేందుకు అధికార యంత్రాంగం సర్వశక్తులు వడ్డింది, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా ఎక్కడికక్కడ ఫెన్షింగ్‌లు ఏర్పాటు చేశారు అధికారులు.అధికారులు వేసిన ఫెన్షింగ్‌ను తొలగించి ఆభూమిని కబ్జా చేసేందుకు భూ బకాసురులు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.కొన్ని చోట్ల ఫెన్షింగ్‌లు తొలగించి రూంలు సైతం కట్టారు. ప్రభుత్వ మారగానే కబ్జా కోరులు కోరలు చాచారు. గతంలో కబ్జాలు చేసేందుకు విశ్వప్రయత్నం చేసి విఫలమైన కొంతమంది ఇప్పుడు తిరిగి ఆభూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వారి ప్రయత్నాలకు బడా నాయకులు సైత ఆపన్న హస్తం అందిస్తున్నట్లు తెలిసింది.ఈ కోవకు చెందిందే 14వ వార్డు బర్మాక్యాంప్‌ సిఎంపిఎఫ్‌ కార్యాలయం వెనుక రూ.6కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి వ్యవహారం. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని 13వార్డులో 6కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే గతప్రభుత్వ హాయంలో ఈప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులు స్థలం కబ్జాకు గురికాకుండా ఫెన్షింగ్‌ ఏర్పాటు చేశారు.ఆప్రభుత్వ భూమిని కబ్జాదారులు కబ్జాచేసి రూంలు సైతం నిర్మించారు. దీంతో ప్రభుత్వ భూమి కబా ్జకు గురైనట్లు తేట తెల్లమవుతుంది. కబ్జాకోరులు రూంలను నిర్మిస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెట్తినట్లు వ్యవహరిస్త్ను దీరు విమర్శలకు తావిస్తుంది. ప్రభుత్వం మారగానే ఆస్థలంలో రూంలు కట్టి సున్నాలు కూడా వేయడం జూస్తుంటే కొంతమంది బడా నాయకుల అండదండలు ఉన్నందువల్లే అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.13వ వార్డులోని ఈ ప్రభుత్వం భూమి కాకుండా మిగతా వార్డుల్లో సైతం ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు సర్వశక్తులు వడ్డుతున్నటుఓ్ల సమాచారం. 13వార్డులో కబ్జాకు గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు చర్యలు తాసుకోవాలని, మిగతా వార్డుల్లో సైతం ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ఫెన్షింగ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వభూములు కబ్జాచేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమి అయితే కాపాడుతాం : తహశీల్దార్‌..
13 వార్డులోని సిఎంపిఎఫ్‌ ఆఫీసు వెనుక ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయంపై కొత్తగూడెం తహశీల్దార్‌ పుల్లయ్యను ఆదాబ్‌హైదరాబాద్‌ వివరణ కోరింది. అది ప్రభుత్వ భూమి అయితే ఖచ్చితంగా కాపాడి తీరుతామని, కబ్జాకు గురైన ఆభూమిలో ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని ప్రభుత్వ భూమిని గుర్తించి పెన్షింగ్‌ వేస్తామని పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు