Friday, May 17, 2024

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

తప్పక చదవండి
  • చెక్‌ పోస్టుల్లో గట్టి నిఘా పెంచాం
  • బృందాలు నిరంతరం తనిఖీలు
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 92.5 శాతం
  • అబర్కీ శాఖ ద్వారా 4 కోట్ల 27 లక్షల 10 వేల 596 రూ. అక్రమ మద్యం సీజ్‌
  • జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌

సూర్యాపేట : జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌ అన్నారు.సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఎస్‌.పి. రాహుల్‌ హెగ్డే, ఆదనవు కలెక్టర్‌ ఏ. వెంకట్‌ రెడ్డి లతో కలసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిల్లా అంతటా పటిష్ఠ చర్యలు చేపట్టామని అన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల్లో 183 కేసుల్లో పట్టుబడిన నగదు, బంగారం, వెండి అలాగే ఇతర వస్తువుల విలువ 4,84,66,316 ఉండగా 173 కేసులకు సంబ ంధించి రూ.4,65, 15,301 గలవి అప్పీల్లకు రాగా వాటిలో 170 కేసుల కు గాను రూ. 3,43, 65, 310 రూపాయలు విడుదల చేయనైనదని అలాగే 3 కేసులకు సంబంధించి రూ. 1,21, 95, 226 రూపాయలు ఐ. టి శాఖకు రిఫర్‌ చేయడం జరిగిందని అన్నారు. మోడల్‌ కోడ్‌ ఉల్లంగన కింద 3 కేసులు నమోదు చేసామని అలాగే దినపత్రికలలో వచ్చే పెయిడ్‌ ఐటమ్స్‌, ప్రకటనల పై సత్వర చర్యలు తీసుకుంటున్నని అలాగే అనుమ తులు కల్పిస్తున్నామని అన్నారు.జిల్లాలో ముందస్తుగా ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికి వెళ్లి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ 92.5 శాతం జరిగిందని అలాగే ఇప్పటివరకు ఓటర్‌ స్లిప్స్‌ పంపిణీ 98 శాతం జరిగిందని మిగిలిన 2 శాతంలో మరణాలు, మార్పులు, గైరాజరు లు ఉన్నాయని తెలిపారు.రేపు (నవంబర్‌ 28) సాయంత్రం 5.00 వరకు జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఆదిశగా అన్ని పార్టీలు ప్రచారం ముగించు కోవాలని అన్నారు. ఎన్నికల నిర్వహణ సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని అలాగే 29న కూడా ఆయా నియోజక వర్గాలలో ఆర్‌.ఓ లు, సాధారణ, వ్యయ పరిశిలకుల ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం ఇచ్చామని తెలిపారు. పోలింగ్‌ , కౌంటింగ్‌ రోజున పటిష్ఠ చర్యలతో పాటు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ఎక్కువగా పోటీలో ఉండడంతో కోదాడ, సూర్యాపేటకు బ్యాలెట్‌ యూనిట్లు అదనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.172 పోలింగ్‌ కేంద్రాలలో వెబ్‌ క్యాస్టింగ్‌ జరుగుతుందని అన్నారు. జుఞషఱంవ శాఖ ఆధ్వర్యంలో బృందాల ద్వారా ఇప్పటివరకు 833 కేసులు నమోదు చేశామని, 319 మందిని అరెస్ట్‌ చేయడం తో పాటు అక్రమ మద్యం 66838 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నమని వాటి విలువ రూ. 4, 27, 10, 596 రూపాయలు ఉంటుందని అలాగే 50 వాహనాలను సీజ్‌ చేశామని కలెక్టర్‌ వివరించారు. అనంతరం ఎస్‌.పి. రాహుల్‌ హెగ్డే మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలలో పటిష్ట భద్రత కల్పిస్తున్నమని అలాగే క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాలలో లోపల భాగంలో 640 వెబ్‌ క్యాస్టింగ్‌ అలాగే బయట భాగంలో 220 చోట వెబ్‌ క్యాస్టింగ్‌ జరుగుతుందని అన్నారు. జిల్లాలకు 3500 పోలీస్‌ బలగాలు వచ్చాయని జిల్లాపై నిరంతరం గట్టి నిఘా పెంచాని అలాగే ఈవీఎం స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పోలీస్‌ బలగాలను ఏర్పాటు చేయడం జరిగిందని 4500 మందిని బైండవర్‌ చేశామని, 460 మందికి వారెంట్లు ఇచ్చామని 100 వేపల్స్‌ డిపాజిట్‌ చేసామని అన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరావు, డి.పి. ఆర్‌.ఓ రమేష్‌ కుమార్‌, డి.ఈ.ఈ మల్లేషం, సి.పి.ఓ వెంకటే శ్వర్లు, డి.ఎస్‌.పి.లు నాగభూషణం,రవి, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు, ఎన్నికలసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు