Thursday, May 2, 2024

ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతుంది : నారా లోకేష్‌

తప్పక చదవండి

అమరావతి : ఏపీ సౌతిండియా బీహార్‌గా మారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గవర్నర్‌తో భేటీ అనంతరం లోకేష్‌ విూడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సహా టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని వివరించామన్నారు. ఆధారాల్లేకుండా రోజుల తరబడి జైళ్లల్లో ఉంచుతున్నారన్నారు. 260 కేసులు సీనియర్‌ నేతలపై పెట్టారని.. టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై 60 వేల కేసులు పెట్టారని అన్నారు. చంద్రబాబుపై ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టారని గవర్నర్‌కు వివరించామన్నారు. జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ను ఏపీలోకి రాకుండా ఎలా అడ్డుకున్నారో గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలపైనే కాకుండా వివిధ వర్గాలకు చెందిన వారిని ఎలా వేధిస్తోన్నారో వివరించామన్నారు. న్యాయ వ్యవస్థపై వైసీపీ చేసిన దాడులు.. 17`ఏ అంశాన్ని పట్టించకోకుండా చంద్రబాబును ఏ విధంగా అరెస్ట్‌ చేశారోననే అంశాన్ని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. భయం తమ బయోడేటాలో లేదన్నారు. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని.. సైకోను ఎదుర్కొవడానికి ఏం ప్రిపరేషన్‌ ఉంటుందని అన్నారు. ప్రజలే యుద్ధం చేయడానికి ప్రిపేర్డుగా ఉన్నారన్నారు. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్లపై క్లారిటీ వచ్చాక.. భవిష్యత్‌ కార్యాచరణ ఫిక్స్‌ చేస్తామని తెలిపారు. రేపు ఏపీ టీడీపీ చీఫ్‌ అచ్చెన్నాయుడు నేతృత్వంలో సీఈఓను కలువనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై వివరిస్తామన్నారు. రూ.150 కోట్లను అడ్వాన్స్‌ రూపంలో చెల్లించినట్టు వైసీపీ ఖాతాలో ఉందన్నారు. ఆ పార్టీకి ఇంకేం ఖర్చుల్లేవంట.. అడ్వాన్స్‌ రూపంలో చేసిన చెల్లింపులు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. సీఎం జగన్‌ దొంగోడని.. దొంగోడు పేరుతో దొంగ ఓట్లు ఎందుకుండవ్‌ అని అన్నారు. 35 కేసుల్లో జగన్‌ నిందితుడన్నారు. సొంత బాబాయ్‌ వైఎస్‌ వివేకాను హత్య చేసిన వ్యక్తి సీఎం జగన్‌ అని విరుచుకుపడ్డారు. జనసేనతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని… త్వరలో మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. కరవుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. తాగునీటి సమస్య కూడా ఉందన్నారు. ఈ సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతామని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు