Sunday, May 19, 2024

మరో పవర్‌ఫుల్‌ అణుబాంబు తయారు చేయనున్న అమెరికా

తప్పక చదవండి

వాషింగ్టన్‌ : హిరోషిమాపై 1945లో ప్రయోగించిన దాని కంటే 24 రెట్లు శక్తివంతమైన అణుబాంబు తయారు చేస్తామని అమెరికా ప్రకటించింది. 2030 నాటికి తమ అణ్వాయుధాల సంఖ్యను వెయ్యికి పైగా పెంచుతామని చైనా ప్రకటించిన అనంతరం పెంటగాన్‌ ఈ ప్రకటన చేసింది. బీ6113 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ’పెంటగాన్‌’ తెలిపింది. నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్టేష్రన్‌ దీన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశం చట్టసభ ముందు పెండిరగులో ఉన్నట్లు సమాచారం. నిరంతరం మారుతున్న ప్రపంచంలో అమెరికా మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడిరచింది. తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారిని ఈ అణుబాంబు నిలువరిస్తుందని పేర్కొంది. ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని వెయ్యికిపైగా పెంచేందుకు చైనా సిద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు. కానీ, ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ బీ6113 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ. బీ61`13 వంటి గ్రావిటీ బాంబులను యుద్ధవిమానాల నుంచి జారవిడుస్తారు. గురుత్వాకర్షణ శక్తి సాయంతో లక్ష్యంపై పడుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు