Friday, May 17, 2024

పన్నెండు వేల మంది ప్రవాసులపై కువైట్‌ బహిష్కరణ వేటు

తప్పక చదవండి

కువైట్‌ : కువైట్‌ కేవలం 3 నెలల్లో సుమారు 12 వేల మంది ప్రవాసులను వారి దేశాలకు పంపించేసింది. ఈ ఏడాది అగస్టు నుంచి అక్టోబర్‌ వరకు 12 వేల మందిని బహిష్క రించింది. వివిధ నేరాలతో పాటు ప్రజా నైతిక నిబంధనల ఉల్లంఘన, కార్మిక చట్టాల అతిక్రమణ ఆరోపణలతో అక్టోబర్‌లో 4,300 మందిని వెళ్లగొట్టారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడకుండా అడ్డు కోవడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నప్పటికీ ప్రవాసీయుల సంఖ్యను తగ్గించుకోవ డానికే కువైట్‌ ఈ చర్యలకు పాల్పడుతున్నదన్న విమర్శలున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు