Monday, May 6, 2024

కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ కు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం

తప్పక చదవండి
  • అమతేర్‌ కబాడీ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ గా ఎన్నిక
  • వీరేష్‌ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తెలంగాణ కబాడీ క్రీడాకారులు

హైదరాబాద్‌ : అమతేర్‌ కబాడీ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ గా తెలంగాణకు చెందిన కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా కొనసాగిన ఢల్లీి ఫార్మర్‌ జడ్జి ,ఓపీ షైనీ నుంచి వీరేష్‌ కు గెలుపు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని అన్నారు. మన దేశంలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని వారిని గుర్తించి దేశానికి పేరు తెచ్చే విధంగా తీర్చి దిద్దడంలో తన వంతు బాధ్యతను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. కాసాని వీరేష్‌ ముదిరాజ్‌ ఎన్నిక పట్ల పలువురు క్రీడాకారులు, క్రీడా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు