Thursday, May 2, 2024

SBI ఖాతాదారులకు తీపికబురు..

తప్పక చదవండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ కార్డ్ కొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ క్రెడిట్ కార్డు వాడే వారికి మరిన్ని అదనపు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటి ద్వారా ఏకంగా రూ. 2 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. ఆ వివరాలేంటో చూద్దాం.
దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు తాజాగా తమ కస్టమర్లకు తీపికబురు చెప్పింది. తమ క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.
సూపర్ ప్రీమియం కార్డు ఆరమ్ వాడే కస్టమర్లకు ఎస్‌బీఐ ఈ కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. సీ సూట్ ఎగ్జిక్యూటివ్స్, హై నెట్‌వర్త్ ఇండివీజువల్స్‌కు ఈ క్రెడిట్ కార్డులు లభిస్తాయి. ఎస్‌బీఐ కార్డు తాజాగా కొత్త యాన్యువల్ స్పెండ్స్ బేస్డ్ మైల్ స్టోన్, వెల్‌కమ్ బెనిఫిట్ కింద అదనపు ఇంటర్నేషనల్ లాంజ్ బెనిఫిట్స్, గోల్ఫ్ ప్రివిలైజెస్ వంటి ఫీచర్లు అందిస్తోంది. ఆరామ్ క్రెడిట్ కార్డు వాడే వారికి మరిన్న బెనిఫిట్స్ లభించినట్లయిందని చెప్పవచ్చు.
ఈ కొత్త ఫీచర్లు ద్వారా ఆరామ్ ప్రీమియం క్రెడిట్ కార్డు వాడే వారికి ఏడాది కాలంలో చూసుకుంటే మొత్తంగా రూ. 2 లక్షల వరకు అదనపు ప్రయోజనం లభిస్తుందని ఎస్‌బీఐ కార్డు తెలిపింది. సూపర్ ప్రీమియం విభాగంలోకి కస్టమర్లకు ఈ కొత్త సేవల వల్ల చాలా ప్రయోజనం కలుగుతుందని ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ అభిజిత్ చక్రవర్తి తెలిపారు. ఈ కార్డు కలిగిన వారికి అపరిమిత ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ లభిస్తుందన్నారు. అలాగే ఇప్పుడు కార్డు కలిగిన వారితో వచ్చే గెస్ట్‌లకు కూడా నాలుగు సార్లు లాంజ్ యాక్సెస్ ఉంటుందని తెలిపారు. ఈ ఆరమ్ ప్రీమియ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఏడాది పాటు క్లబ్ మారియట్ మెంబర్‌షిప్ కూడా వెల్‌కమ్ గిఫ్ట్ రూపంలో లభిస్తుందని తెలిపింది ఎస్‌బీఐ కార్డు. హోటల్‌లో బస చేయడం, ఫుడ్, బేవరేజెస్, స్పా వంటి వాటిల్లో 25 శాతం మేర డిస్కౌంట్ లభిస్తుందని వెల్లడించింది. అయితే, ఈ ఆఫర్ మారియట్ గ్రూప్ హోటల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ. 9,999గా ఉండగా.. ఏడాదికి రూ. 12 లక్షలు ఖర్చు చేస్తే.. అప్పుడు ఈ కార్డు ఫీజును మాఫీ చేస్తారు. అందరికీ ఈ కార్డు అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే హైనెట్ వర్త్ కలిగిన వారికి మాత్రమే ఈ కార్డు లభిస్తుందని స్పష్టంగా చెప్పవచ్చు. మరో వైపు కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావించే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవసరాలకు అనుగుణమైన కార్డును ఎంచుకోవడం ఉత్తమం. లేదంటే తర్వాత కార్డు ద్వారా పొందే బెనిఫిట్స్ పెద్దగా ఉండకపోవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు