Tuesday, May 14, 2024

వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్‌ వేరియంట్‌

తప్పక చదవండి
  • కేరళలో జేఎన్‌1తీవ్ర వ్యాప్తి

న్యూఢిల్లీ : మరోమారు కరోనా మహమ్మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే వైరస్‌ భయం నుండి బయటపడిన ప్రపంచం కోలుకుంటుంది..ఈ క్రమంలోనే కోవిడ్‌ కొత్త రూపంలో కోవిడ్‌ కోరలు చాస్తుంది. కోవిడ్‌- 19 వైరస్‌ ఓమిక్రాన్‌ వేరియంట్‌కు చెందిన జేఎన్‌1 విస్తృతంగా వ్యాపిస్తోంది. జేఎన్‌1 అనేది శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని సులభంగా అధిగమించి మనుషుల్లోకి ప్రవేశించగల, ఎఫెక్టీవ్‌ వైవిధ్యంగా చెబుతున్నారు నిపుణులు. అంటే ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి అతి తక్కువ సమయంలోనే చేరుతుంది. ఇప్పుడు కేరళలోనూ జేఎన్‌1 తీవ్ర పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు, వేడుకల సమయం కాబట్టి జేఎన్‌1 కోవిడ్‌ కేసులు పెరిగే అవకాశం ఉందని అందరూ ఆందోళన చెందుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్‌ కేసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కేరళలో పరిస్థితి కాస్త విపరీతంగా ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగానే.. కొత్త కోవిడ్‌ వైరస్‌ వేరియంట్‌ జేఎన్‌1 కూడా న్యుమోనియాకు దారితీస్తుందనే నిర్ధారణ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. దీంతో కోవిడ్‌ కారణంగానే కాకుండా న్యుమోనియా కారణంగా కూడా ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారవచ్చు. జేఎన్‌1 ఊపిరితిత్తులకు పెద్ద సవాలుగా మారనుందని తెలుసుకున్న నిపుణులు జేఎన్‌1 వల్ల కలిగే అతిపెద్ద సమస్య న్యుమోనియా అని గమనించారు. చాలా మందికి వచ్చిన న్యుమోనియా చాలా తీవ్రంగా ఉందని, అది ప్రాణాపాయం కూడా కలిగిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. కోవిడ్‌ వైరస్‌ వేరియంట్‌లో న్యుమోనియాకు దారితీసే అనేక మార్పులు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సందర్భంలో, కోవిడ్‌-19 సోకిన వారు కొన్ని లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం మంచిదని సూచిస్తున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలతో బాధపడేవారు వెంటనే వైద్యులను సంప్రదించటం ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే.. జేఎన్‌1 న్యుమోనియాకు దారితీస్తే కనిపించే లక్షణాలు ఇవే అంటున్నారు.. కోవిడ్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయడం ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన రక్షణగా చెబుతున్నారు. కానీ జేఎన్‌1కి వ్యతిరేకంగా టీకాలు వేయడం గురించి ఖచ్చితమైన సమాచారం లేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు