Sunday, May 19, 2024

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..

తప్పక చదవండి
  • రేణుక, సాయికిరణ్‌ ఓకేషనల్‌ కళాశాలల యాజమాన్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
  • రోడ్డు పక్కనే ఈ కళాశాలు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా..
  • టీ.సి.లు మేమ్మోల పేరిట 3 నుంచి 5 వేల రూపాయల వరకు వసూళ్లు
  • ఈ కళాశాలల్లో అయితే పైర్‌ సెప్టీ,ప్లే గ్రౌండ్‌, సైన్స్‌ ల్యాబ్స్‌, కంప్యూటర్లు అసలే లేవు
  • మమ్ముల మత్తులో జిల్లా నోడల్‌ అధికారి..
  • టీఎన్‌వీఎస్‌ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్‌ డిమాండ్‌

బాన్సువాడ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : పట్టణంలో ఉన్న రేణుక,సాయి కిరణ్‌ ఓకేషనల్‌ కళాశాలల యాజమాన్యలు ఇష్టానూ సారంగా అధిక పీజులు వసూల్ చేస్తున్నారని టీఎన్‌వీఎస్‌ తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్‌ అన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ మండలం పట్టణంలో ఉన్న రేణుక,సాయి కిరణ్‌ ఓకేషనల్‌ కళాశాలలోఓకేషనల్‌ పూర్తి అయిన ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు తమ తమ టీ.సీ.లు మేమేల కోసం వస్తే ఈ కళాశాలలో చెలించవాల్సిన పీజులను పూర్తి స్థాయిలో చెలించినప్పటికి ఆయా సర్టిపికెట్స్‌ ఇవ్వాలంటే 3 వేల నుంచి 5 వేల రూపాయల వరకు చెలించవాల్సిందేనని ఈ కళాశాలల యాజమాన్యలు డిమాండ్‌ చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ విషయంపై జిల్లా నోడల్‌ అధికారి విద్యార్థులకు టీ.సీ.లు కానీ మేమేల విషయంలో అందించేం దుకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశాలు జరిచేసినప్పటికీ ఈ కళాశాల యాజమాన్యలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని ఆయన తెలిపారు.మరియు ఈ కళాశాలల్లో అయితే అర్హులైన లేక్చరర్లతో విద్యాబోధన చేపడుతలేరని, పైర్‌ సెప్టీ, ప్లే గ్రౌండ్‌, కంప్యూటర్లు, సైన్స్‌ ల్యాబ్స్‌, సరైన సదుపాయాలు లేవని ఆయన అన్నారు. రోడ్డు పక్కన ఉన్న ఈ కళాశాలకు కనీసం సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరియు విద్యార్థుల దెగ్గర నుంచి ఇష్టం వచ్చినట్లు విచ్చాలవిడిగా అధికాపిజులు వాసులు చెంస్తూన్నారని మరియు ఈ కళాశాలలో అర్హులైన లెక్చరర్లు లేక విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఈ రేణుక, సాయి కిరణ్‌ కళాశాల యాజమాన్యలపై జిల్లా నోడల్‌ అధికారి జిల్లా ఉన్నత ఉన్నత అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేసి ఈ కళాశాలల యొక్క గుర్తింపులను వెంటనే రద్దు చేయాలని ఆయన జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు