Friday, May 3, 2024

మహిళా చట్టాలపై సదవగాహన అనివార్యం

తప్పక చదవండి
  • డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు

హైదరాబాద్ : విశాల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ, లింగ వివక్షరహిత సమాజ నిర్మాణం దిశగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన మహిళా చట్టాలపై సదవగాహన కల్పించడం అదొక సామాజిక బాధ్యతగా నిర్వర్తించాలని సంకల్పించడం మహోన్నతమైనదని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. ఇలాంటి ఉన్నత ఆశయాలతో మహిళా సాధికారికత సొసైటీ ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. శనివారం నాడు నగరంలోని కాచిగూడలో గల ఒక ప్రముఖ హోటల్ లో “స్త్రీ సాధికారికత – చట్టాలు – సదవగాహన” అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమం కు సమన్యయకర్తలుగా సొసైటి అధ్యక్షురాలు శ్రీ. రమా పవిత్ర, గ్యార సింధూరలు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, ప్రత్యేక అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వాల్ పోస్టర్ (గోడ పత్రిక) ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సదస్సులో మహిళా సామాజిక వేత్తలు, యువ పారిశ్రామిక వేత్తలు, సామాజిక ఉద్యమకారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ… ఉన్నతమైన ప్రయోజనాల నిమిత్తం మహిళా చట్టాలను ప్రభుత్వాలు అమలులోకి తెచ్చాయని, కాగా పలు సందర్భాలలో వ్యక్తిగతంగా, స్వార్ధ చింతనతో ఆ చట్టాల లక్ష్యాలను నీరుగార్చే దిశగా జరుగుతున్న కొన్ని సంఘటనలు విచారాన్ని కల్గిస్తున్నాయని ఆయన అన్నారు. కొన్ని సందర్భాలలో ఇచ్చేటటువంటి తప్పుడు ఫిర్యాదుల కారణం నేపథ్యంగా, నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుండడం గమనించదగిందని, అలాంటివి అభిలషనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై సదవగాహన కల్పించడానికి వీలుగా, యదార్థ సంఘటనలను సేకరించి చట్టాలపై సదవగాహన కల్పించడానికి మహిళా సాధికారికత సొసైటి నడుం బిగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సేవలను ఉచితంగా సమాజంలో అందించడానికి ముందుకు రావడం గొప్ప పరిణామం అన్నారు.

దుండ్ర కుమార స్వామి ప్రసంగిస్తూ… ఇలాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలు సమాజంలో గొప్ప మార్పుకు దారి తీస్తాయని, చట్టాలు ఎవరికీ చుట్టాలు కావని, చట్టాల లక్ష్యాలను నీరుగార్చలనుకోవడం మంచిది కాదన్నారు. సొసైటి ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆయన అభిలషించారు. మహిళా సాధికారికత సొసైటీ అధ్యక్షురాలు రమా పవిత్ర మాట్లాడుతూ.. తాము ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నామన్నారు. స్త్రీ పురుషులు ఇరువురికి చట్టాలపై, ప్రభుత్వ ఉత్తర్వులపై సదవగాహన కల్పించడానికి తమ సొసైటీ సభ్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎలాంటి అవసరాలు వచ్చినా తమను సంప్రదించవచ్చని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు