Sunday, October 13, 2024
spot_img

సంస్కృతికి, సంప్రదాయానికి నిదర్శనం అలయ్-బలయ్

తప్పక చదవండి
  • జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి

తెలంగాణ రాష్ట్రానికి, సంప్రదాయానికి, సంస్కృతికి, ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం అలయ్-బలయ్ కార్యక్రమం అని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దసరా పండగకు ముందు జరిగే ఒక సాంప్రదాయ, సాంస్కృతిక ఉత్సవం అలాయ్- బలాయ్. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం లోని ప్రజల జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రజలలో సోదరభావం తీసుకురావడమే ఈ ఉత్సవ లక్ష్యమని దుండ్ర కుమారస్వామి అన్నారు. ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అలయ్-బలయ్ నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 01-10-2023న అలయ్-బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపే పోస్టర్ ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివ ముదిరాజ్, కోట్ల పుష్ప ముదిరాజ్, రమేష్ ముదిరాజ్, కురుమూర్తి ,ముదిరాజ్, నరసింహ సురేష్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.
పోస్టర్ లాంఛ్ కార్యక్రమంలో దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ముదిరాజుల ఐక్యతే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయం అని అన్నారు. ముదిరాజ్ ల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని పిలుపును ఇచ్చారు. ముదిరాజుల రాజకీయ హక్కులు సాధించే వరకూ అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని.. ముదిరాజ్ లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ముదిరాజ్ లకే పార్టీలు టికెట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగి ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం రాజ్యాధికారంలో మాత్రం విస్మరణకు గురువుతోందన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రతిపాదికన ముదిరాజ్​లకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. ఎన్నో నియోజకవర్గాల్లో గెలుపోవటములను ప్రభావితం చేసేలా ఉన్న ముదిరాజ్ సామాజికవర్గం సరైన ప్రాధాన్యతకు నోచుకో లేకుండా పోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి ముదిరాజు నాయకులు పాల్గొన్నారు.

ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం అలయ్-బలయ్ కార్యక్రమమని దుండ్ర కుమారస్వామి అన్నారు. తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్ బలయ్.. బీసీలను ఏక తాటిపైకి తీసుకువచ్చే ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయమన్నారు. బీసీలు ఐక్యతతో ముందుకు వెళ్ళాలని.. బీసీల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా బీసీలు ముందుకు వెళ్ళాలన్నారు. ముదిరాజ్ లు సంస్కృతిని కాపాడుతూ ఉన్నారు.. వారు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షించారు. దీన్ని ఒక సత్సంబంధాల వేడుకగా మార్చుకోవడం.. బీసీలు అందరూ కలిసి ముందుకు వెళ్తూ ఉండడం చాలా మంచి పరిణామం అని దుండ్ర కుమారస్వామి అన్నారు. మన హక్కులను కాపాడుకోడానికి ఎలా ముందుకు వెళ్ళాలో ఇలాంటి కార్యక్రమాలు మనకు తెలియజేస్తాయని దుండ్ర కుమారస్వామి అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు