Tuesday, May 14, 2024

గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు

తప్పక చదవండి

గాజా : ఇజ్రాయెల్‌ `హమాస్‌ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజాలో పరిస్థితులు పరిస్థితులు దారుణంగా మారాయి. గాజా స్టిప్ర్‌ని ఇజ్రాయెల్‌ అన్నివైపుల నుంచి దిగ్భందించడంతో తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. బాంబుల మోతతో బతుకు జీవుడా అంటూ కట్టుబట్టలతో వలసబాటపట్టారు. ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు గాజా పౌరుల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపాయి. యుద్ధం వల్ల నగరంలో ఇప్పటివరకు 60 శాతానికిపైగా మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది. గత నెల 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా గాజాపై ఆ దేశం దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం లక్షా 82 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఐఎల్‌ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. జీవనోపాధి కోల్పోవడంతో దాదాపు సగంమంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని వెల్లడిరచింది. యుద్ధం వల్ల పాలస్తీనా లేబర్‌ మార్కెట్‌ ఆర్థిక సంక్షోభంలో పడిరద ని, మరికొంత కాలం ఇలాగే కొనసాగితే పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని ఐఎల్‌ఓ అరబ్‌ రాష్టాల్ర ప్రాంతీయ డైరెక్టర్‌ రుబా జరాదత్‌ చెప్పారు. ఈ సంక్షోభం వల్ల గాజాలో ఇదే పరిస్థితి కొన్నేండ్లపాటు ప్రతిధ్వనిస్తుందన్నారు. ఇజ్రాయెల్‌ ఆంక్షల వల్ల యుద్దానికి ముందుకూడా గాజాలోని 23 లక్షల మందికిపైగా పేదరిక రేఖకు దిగువనే ఉండేవారని వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు