Saturday, May 11, 2024

వైన్స్, బార్లు 50శాతం గౌడ్స్ కి ఇవ్వాలి..

తప్పక చదవండి
  • కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ డి. శ్రీధర్ బాబుకు
    గౌడ సంఘాల సమన్వయ కమిటీ వినతి.

హైదరాబాద్ : తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ గౌడ కల్లగీత సంఘాల సమన్వయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నది… రోజు రోజుకు తరుగుతున్న కల్లుగీతవృత్తి…పెరుగుతున్న నిరుద్యోగంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్న కల్లుగీత వృత్తిదారులకు, కల్లుగీత సొసైటీలకు 50శాతం వైన్సులు ఇవ్వాలని బార్లు గౌడ్స్ కు సబ్సిడీతో కూడిన రిజర్వేషన్ కల్పించాలని, ప్రస్తుతం తెలంగాణలో లిక్కర్ 17 లిక్కర్ కంపెనీలు ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్నాయి… తక్షణమే వారి అగ్రిమెంట్లను రద్దుచేసి 50శాతం గౌడ్స్ కి ఇవ్వాలి.. ఈ మేరకు సోమవారం రోజు గాంధీభవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే డి. శ్రీధర్ బాబుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

50 సం.. రాలు పైబడిన గీత వృత్తిదారులకు రూ. 5000/- పెన్షన్ ఇవ్వాలని, కల్లుగీత కార్పొరేషన్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి గౌడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని, ప్రమాదంలో మరణించిన, తీవ్ర గాయాల పాలైనా గీతవృత్తిదారులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి.. ప్రమాదాల నివారణకు సేఫ్టీ పరికరాలు అందజేయాలి.. ద్విచక్ర వాహనాలు ఇవ్వాలి.. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని, సూర్యాపేట జిల్లాకు ధర్మబిక్షం పేరు పెట్టాలని, హైదరాబాద్ యూనివర్సిటీకి సర్దార్ సర్వాయి పాపన్న పేరును పెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.. కలసి వినతి పత్రం సంపర్పించిన వారిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ చైర్మన్ ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు