Tuesday, May 7, 2024

ఎనిమిది రోజుల్లో 108 మంది మృతి

తప్పక చదవండి

ముంబై : అధికారంలో ఉన్న మహారాష్ట్రలోని సర్కార్‌ దవాఖా నాల్లో నెలకొన్ని అధ్వాన పరిస్థితులు రోగుల ప్రాణాల్ని బలికొంటున్నాయి. నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 24 గంటల్లో (బుధవారం ఉదయం 8గంటల నాటికి) మరో 11 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఇక్కడ గత 8 రోజుల్లో మొత్తం మరో 108 మంది రోగులు చనిపోయారు. సెంట్రల్‌ నాందెడ్‌లోని శంకర్రావు చవాన్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ, దవాఖాన డీన్‌ శ్యామ్‌ వాకోడే ఈ మరణాలపై మాట్లాడుతూ దవాఖానలో 24 గంటల్లో సగటు మరణాల రేటు 11కు తగ్గించగలిగామని అన్నారు. దవాఖానలో వైద్య సేవలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాందేడ్‌ దవాఖానలోని ’ఎన్‌ఐసీయూ’లో కేవలం ముగ్గురు నర్సులతో వైద్య సేవలు అందిస్తున్నారని మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ తప్పుబట్టారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు