Saturday, April 27, 2024

అక్రమాలపై సమరశంఖం పూరిస్తున్న ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘..

తప్పక చదవండి
  • ఆధారాలతో వెలుగులోకి తెస్తున్నా
    ఉలుకూ పలుకూ లేని అధికార ప్రభుత్వం..
  • ప్రతిపక్ష నేతలకున్న సోయి వారికి లేకపోయే..
  • రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాం పూర్ రామాయలయ
    భూముల అన్యాక్రాంతమై వరుస కథనాలు రాసిన ఆదాబ్..
  • భూముల సంరక్షణ కోసం అలుపెరుగని పోరాటం
    చేస్తున్న రాష్ట్రీయ వానర సేన..
  • ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన
    బీజేపీ మహిళా నేత విజయశాంతి..

ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములు, పట్టా భూములు, దేవాలయ భూములు, వక్ఫ్ బోర్డు భూములు.. ఒక్కటేమిటి ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా అమాంతం రాబందుల్లా వాలిపోయి.. అడ్డగోలుగా ఆక్రమించేస్తున్నారు కబ్జాకోరులు.. ఇదొక కోణం అయితే సాక్షాత్తూ పాలిస్తున్న ప్రభుత్వమే ప్రభుత్వ భూములను, దేవాదాయ భూములను అన్యాక్రాంతం చేస్తుండటం శోచనీయం.. తెలంగాణ ప్రభుత్వంలో భూమాతకు రక్షణ అనేది లేకుండా పోతోంది అన్నది నిర్విదాంశం.. ఇదే కోవలోకి రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలం, సీతారాంపూర్ లో శ్రీ రాములవారి దేవాలయానికి చెందిన భూములను కార్పొరేట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెడుతోంది తెలంగాణ ప్రభుత్వం.. ఈ అక్రమ వ్యవహారంపై ఆదాబ్ వరుస కథనాలు ప్రచురించింది.. అదే విధంగా రాష్ట్రీయ వానరసేన వారు ఆ భూములను రక్షించడానికి అలుపెరుగని పోరాటం చేస్తోంది.. ఆదాబ్ కథనాలపై, స్పందిస్తున్నారు వివిధ పార్టీలకు చెందిన నాయకులు.. తాజాగా బీజేపీ మహిళా నాయకురాలు విజయశాంతి ఈ అక్రమ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బీజేపీ మహిళా నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్‌ లో రామాలయం భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటోందని విజయశాంతి ఆరోపించారు. కోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా రామాలయానికి భక్తులు సమర్పించిన సుమారు 11 వందల ఎకరాల భూమిని చట్టవిరుద్ధంగా ఇండస్ట్రియల్ పార్కుకు అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. తెలంగాణలో గులాబీ నేతల భూకబ్జాలు, ఆక్రమణలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు.

- Advertisement -

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని విజయశాంతి విమర్శించారు. కనీసం సేకరించిన భూమికి పరిహారం విషయం కూడా ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ పూజలు, యాగాలు కేవలం పొగడ్తలే తప్ప దేవుడిపై ఏమాత్రం గౌరవం లేవని స్పష్టమవుతోందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దేవుళ్ల పేరు చెప్పి దేవాలయాల భూములను లాక్కుంటోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు