Saturday, May 18, 2024

నేడు జనసేన ఛీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో

తప్పక చదవండి
  • జనసేన బిజెపిల ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌కు మద్దతుగా రోడ్‌ షో

కూకట్‌పల్లి : తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం చివరి రోజైన నవంబర్‌ 28 జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ రోడ్‌ షో నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం కూకట్‌ పల్లి నియోజకవర్గంలో బాలానగర్‌ నుంచి హస్మత్‌ పేట అంబేడ్కర్‌ విగ్రహం వరకూ సాగుతుంది. మధ్యాహ్నం 2 గం.కు బాలానగర్‌ చౌరస్తా నుంచి మొదలవుతుంది. న్యూ బోయిన్‌ పల్లి సిగ్నల్‌ క్రాస్‌ నుంచి వయా బోయిన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ మీదుగా ఓల్డ్‌ బోయిన్‌ పల్లి చెక్‌ పోస్ట్‌, హస్మత్‌ పేట బస్టాప్‌, అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ఈ యాత్ర సాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తారు. కూకట్‌ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధిగా ముమ్మారెడ్డి ప్రేమకుమార్‌ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన బిజెపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పవన్‌ కళ్యాణ్‌ ప్రచారం చేయనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు