Friday, May 17, 2024

మహేశ్వరం ప్రజలారా ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా : కే.ఎల్‌.ఆర్‌

తప్పక చదవండి
  • మహేశ్వరం నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దా…
  • బడంగ్పేట్‌ :మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసే యోచలో ఉన్నాను ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని సోమవారం రోజున మీడియా ముఖంగా కే.ఎల్‌.అర్‌ కోరారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తా నాకు మహేశ్వరం నియోజకవర్గం పై పూర్తి అవగాహన ఉంది స్థానికంగా తుక్కుగూడలో సొంత నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాను నేను ఇక్కడ వాడినే ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. మహేశ్వరం నియోజకవర్గం పలు ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు అధికంగా ఉన్నాయి. డ్రైనేజీ కాలువలు వెళ్లి చెరువుల్లో కలుస్తూ ఉండటం వల్ల అవి కలుషితమై పోతున్నాయి. అలా డ్రైనేజీ నీరు చెరువుల్లో కలపకుండా దారి మళ్లించేందుకు నిధులు మంజూరైనప్పటికీ పనులు మాత్రం పూర్తి చేయలేదు. ఈ విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను. మీర్పేట, బడంగ్పేట ప్రాం తాల ప్రజలకు కూడా ఆస్పత్రి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. నేను గెలిచిన కొన్ని రోజుల్లోనే 100వంద పడకల ఆసు పత్రిని ప్రజలకు అందుబాటులో ఉంచుతాను. మహేశ్వరంలో సింగిల్‌ రోడ్డు కారణంగా, దర్గా, దేవాలయాల కారణంగా ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా ఉంది. ఇక్కడ బైపాస్‌ రోడ్డు వేయాలన్న నిర్ణయం కూడా చాలా కాలంగా పెండిరగ్లో ఉంది. స్థానిక రైతుల తో మాట్లాడ్‌ ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఏర్పాటు చేస్తాను. పలు ప్రాంతాల్లో, పలు కాలనీలలో బస్సు షెల్టర్ల నిర్మా ణం కూడా మున్సిపల్‌ ఉన్నత అధికారులతో మాట్లాడి పూర్తి చేయి స్తాను. మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్పేట్‌ మీర్పేట్‌ పరి సర ప్రాంతాల్లో క్రీడాభివృద్ధి కోసం మినీ స్టేడియం నిర్మిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేఎల్‌ఆర్‌ ట్రస్ట్‌ తరఫున నేను క్రీడా కారులను ప్రోత్సహించడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. ప్రభుత్వ పాఠశాలల్లో పిఈటి టీచర్లు లేనిచోట్ల నేనే వారిని నియమించి నా సొంత నిధులతో జీతాలు ఇస్తాను. అలాగే వివిధ క్రీడలకు సంబంధించి జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి టోర్నమెంటులను నిర్వహింపచేసాను. బయట ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకా రులు అందరికీ వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించాను. కాబట్టి క్రీడల్ని ప్రోత్సహించాలనే విషయంలో నాకు పూర్తి అవగాహన ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మినీ స్టేడియం నిర్మాణానికి ప్రయత్నం చేసి వీలైనంత త్వరలో తప్పనిసరిగా పూర్తి చేయిస్తాను. మహేశ్వరంలో సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్కు వందల కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న సొంత భవనం లేదు. ఇదిగో చేస్తా అదిగో చేస్తామని మంత్రి చెప్పారు తప్ప సొంత భవనం నిర్మించ డానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా పార్టీ అధికారంలోకి రాగానే నేను శ్రద్ధ తీసుకొని సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ కు నూతన భవనం నిర్మిస్తాను. స్థానికంగా ఉన్న 30 పడకల ఆసు పత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేయాలని చాలా కాలం నుంచి ప్రతిపాదన ఉంది. దీనికోసం వైయస్సార్‌ ప్రభుత్వ హయాంలో 16 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి కూడా. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పట్టించుకోలేదు. మంత్రి కూడా ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. కాబట్టి మా ప్రభుత్వం రాగానే ఆసుపత్రిని ఆధునికరించడంతోపాటు పడకల సంఖ్యను కూడా పెంచే ఏర్పాటు చేస్తాను.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు