Friday, May 3, 2024

తబ్లీఘీ జమాత్‌కు తెలంగాణ ప్రభుత్వ నిధుల మంజూరు..

తప్పక చదవండి
  • వికారాబాద్‌లో తబ్లీఘీ జమాత్‌ సమావేశాలకు ప్రభుత్వ నిధులు
  • రాష్ట్రం దివాల తీసిందన్న ప్రభుత్వం.. నిధులు ఎలా మంజూరు చేసిందని ప్రశ్న
  • సీఎం రేవంత్‌కు తెలిసే ఇదంతా జరిగిందా? అంటూ ఆగ్రహం
  • ఉగ్రవాద సంస్థకు నిధుల మంజూరు వెనక మాస్టర్ మైండ్ ఎవరని ప్రశ్నించిన సంజయ్

వచ్చే జనవరిలో వికారాబాద్‌లో జరగనున్న తబ్లీఘీ జమాత్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందంటూ బీజేపీ ఎంపీ బండి సంజయ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇస్లామిక్ సొసైటీ పేరిట పరిగి మండలంలో తబ్లీఘీ జమాత్ నిర్వహించనున్న ఈ మీటింగ్‌లకు రూ.2.45 కోట్లు విడుదల చేయడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర నిఘా విభాగం ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను తుక్డే తుక్డే గ్యాంగ్ ఏం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. బలవంతపు మత మార్పిళ్లను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తబ్లిగీ జమాత్ సంస్థకు రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేయడం దుర్మార్గమని.. ఇలాంటి సంస్థలకు నిధులు ఎలా ఇస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో వచ్చే నెల జనవరి 6, 7, 8 తేదీల్లో ఇస్లామిక్ సమాజం పేరిట తబ్లిగీ జమాత్ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల 45 లక్షలకు పైగా నిధులు మంజూరు చేయడం దారుణమని విమర్శించారు. భారత దేశానికి పెను ప్రమాదంగా మారిన తబ్లిగీ జమాత్‌కు రాష్ట్ర సర్కారు నిధులివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని బండి సంజయ్ తెలిపారు. కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ విషయం తెలీదా..? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి..? తుక్టే తుక్డే గ్యాంగ్‌తో తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారు..? అంటూ బండి సంజయ్ ప్రశ్నలు కురిపించారు. టెర్రరిజం, బలవంతపు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్న ఈ సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిధులిస్తూ ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. తీవ్రవాద భావజాల వ్యాప్తికి, బలవంతపు మత మార్పిళ్లకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం వెనుక సూత్రధారులెవరో తేల్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సూత్రదారులపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే తబ్లిగీ జమాత్ సమావేశాన్ని రద్దు చేయాలని.. లేనిపక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు