ఓ మనిషి ఎందుకు నీకు ఇంత ఆశ..
పశు పక్షాదులను చూసి నేర్చుకోలేవా..
పక్షులు గుడ్లు పెట్టి మూడు నెలల వరకే
తమ పిల్లల్ని తమ వెంట ఉంచుకుంటాయి.
ఓ మనిషి మరి నీవు మాత్రం నీ పిల్లలు,
వారి పిల్లలకు సరిపడా ఆస్తులు కూడ పెడతావ్..
ఇదేనా.. నువ్వు ప్రకృతి నుండి నేర్చుకున్నది..
ప్రకృతి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నది…
కానీ నువ్వు ప్రకృతిని క్షణక్షణం అన్ని విధాల నాశనం
చేయడానికి తయారవుతున్నావ్..
ఓ మనిషి ఇకనైనా మార్పు చెంది స్పృహలోకి రా..
- తిరుపతి గుర్రాల