ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజల జీతగాడు.
సీఎం అంటే రాష్ట్ర ప్రజలకు పెద్ద జీతగాడు.
ఓటు అంటే తెల్ల కాగితం కాదు!
కంప్యూటర్ బటన్ కాదు!!
వెయ్యి రూపాయల నోటు కాదు..
బీరు, విస్కీ బాటిల్ అసలే కాదు…
మనం ఓటు వేస్తే ఎమ్మెల్యేలు అవుతున్నారు..
ఎమ్మెల్యేలను కూడగడితే ముఖ్యమంత్రులు
అవుతున్నారు. మనం ఓటు వేస్తే ఎంపీలు అవుతున్నారు..
ఎంపీలను కూడ కడితే ప్రధాన మంత్రులు
అవుతున్నారు…
ప్రజాస్వామ్య పాలన మన చేతుల్లోనే ఉంది..
- కోట్ల వాసుదేవ్..