ఐదేళ్లు గడిస్తేగాని జనాలు
గుర్తురాని ఆధునిక గజినీలు..
ఆచరణకు వీలుకాని హామీల
నోములు నోచే హేమాహేమీలు..
చెవుల్లో పూలమొక్కల విత్తులను
మొలిపించే ప్రభుద్దులు..
పెదాలమీదే పిండివంటలు వండే
నవయుగ నలభీములు..
రేవు దాటేసాక తెప్ప తగలేసే
మహామహులు.. ఎన్నాళ్ళో కృత్రిమ శ్వాసతో
మూలిగిన నల్లధనం..
ఇన్నాళ్ళకి స్వేచ్చావాయువు పీల్చుకునే
చక్కని తరుణం..
- అల్లి ప్రవీణ్