Tuesday, May 14, 2024

విశాఖ బీచ్‌లో తీవ్రంగా గాయపడిన యువతి..

తప్పక చదవండి
  • అంబులెన్స్ కోసమని వెళ్లిన యువకుడు
  • శిర్డీ జర్నీలో పరిచయం
  • ఈ నెల 2న ఇద్దరు వివాహం చేసుకున్నారు
  • లాడ్జిలో రూమ్ తీసుకుని అరకు ట్రిప్!

విశాఖ శివారులోని అప్పికొండ బీచ్‌లో యువతి రాళ్ల మధ్య ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే వీరిద్దరు ఈ నెల 2న వివాహం చేసుకున్నారు. మళ్లీ బీచ్‌కు వచ్చి ఫోటోలు తీసుకుంటున్న క్రమంలో పడిపోయినట్లు యువతి అంటున్నారు. అంబులెన్స్ తీసుకొస్తానని చెప్పిన యువకుడు తిరిగి రాలేదు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు. విశాఖ అప్పికొండ బీచ్‌లో యువతి రాళ్ల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కలకలంరేపింది. ఈ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన యువతి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఫణింద్ర కుటుంబాలు ఐదు నెలల కిందట శిర్డీయాత్రకు వెళ్తుండగా.. రైలులో పరిచమయ్యాయి. ఆ తర్వాత యువతి, ఫణి ఇన్‌స్టాగ్రాం ద్వారా మరింత దగ్గరయ్యారు. గత నెల 29న ఇద్దరూ కలిసి విశాఖ వచ్చి గోపాలపట్నం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఈ నెల 2న అప్పికొండ, గంగవరం తీరాల్లో పర్యటించారు. 4, 5వ తేదీల్లో అరకు వెళ్లి, 6వ తేదీన తిరిగి గోపాలపట్నం లాడ్జికి చేరుకున్నారు. 8న అప్పికొండ తీరానికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల వరకు సరదాగా గడిపారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో యువతి కిందకు పడిపోయి.. రాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. అయితే అంబులెన్స్‌ను తీసుకువస్తానని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోయాడు. యువతి బీచ్‌లోనే రాత్రంతా ఉండిపోయింది.. నగర శివారు ప్రాంతం కావడం.. ఆ చుట్టు పక్కల ప్రాంతంలో జనాలు లేకపోవడంతో చీకటిలోనే భయం భయంగా గడిపింది. మంగళవారం ఉదయం సముద్రం తీరానికి వెళ్లిన స్థానిక మత్స్యకారులు గాయాలతో ఉన్న యువతిని గమనించారు. ఈ ప్రమాదంలో యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సరిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను ఇసుక తిన్నెల మీదుగా ఒక డోలిని ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. వెంటనే అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. కేజీహెచ్‌లో యువతి నుంచి వివరాలు సేకరించారు.
తామిద్దర కొండపై ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ పడిపోయానని.. ఫణీంద్ర అంబులెన్స్‌ తీసుకువస్తానని చెప్పి వెళ్లినట్టు ఆమె తెలిపిందన్నారు పోలీసులు. అయినా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. ప్రమాదవశాత్తూ పడిపోయిందా లేదా మరేదన్న జరిగిందా?.. అనే కోణంలో ఆరా తీస్తున్నామన్నారు. ఫణీంద్ర ఫోన్‌ రింగ్‌ అవుతుందని.. కానీ లిఫ్ట్‌ చేయడం లేదని పోలీసులు అంటున్నారు. పోలీసులు యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు కూడా విశాఖ వచ్చారు. మరోవైపు తమ కుమార్తె కనబడటంలేదని యువతి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే యువతి, యువకుడు పెళ్లి చేసుకున్నవారనే మరో వాదన వినిపిస్తోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫణీంద్ర దొరికితే కానీ పూర్తి వివరాలు తెలియవు అంటున్నారు.. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అతడి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు తీవ్ర గాయాలైన యువతి ఆస్పత్రిలో కోలుకుంటోంది.. ఆమె తల్లిదండ్రులు కూడా విశాఖలోనే ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు