Saturday, May 18, 2024

యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి రాజీనామా..

తప్పక చదవండి
  • దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు వెల్లడి.
  • నూతన ఈవోగా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ
  • 14 ఏండ్లుగా లేని ధర్మకర్తల పాలక మండలి
  • సామాన్యులకు నష్టం కలిగించిన గీత నిర్ణయాలు

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆలయ ఈవోగా రామకృష్ణ రావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం స్వామివారిని దర్శించుకుని ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన యాదాద్రి ఆలయానికి ఇన్‌చార్జి ఈవోగా పనిచేశారు. యాదాద్రి ఆలయ ఈవోగా పనిచేసిన గీతారెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. సుమారు తొమ్మిదేళ్లుగా సుదీర్ఘంగా ఈవోగా సేవలందించిన గీతారెడ్డి.. ఉన్నట్టుండి రాజీనామా చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. దేవాదాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు లేఖలో వెల్లడిరచారు. కానీ.. ఆమె రాజీనామా వెనుక అనేక కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమెపై స్థానికుల నుంచి వచ్చిన ఆరోపణలే అసలు కారణంగా చెప్తున్నారు. 2014లో ఆమె యాదాద్రి ఆలయ ఈవోగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నియమించింది. అయితే.. 2020లో తన పదవి విరమణ అనంతరం.. మళ్లీ ఆమెనే ఈవోగా అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ కొనసాగించింది. అయితే.. ఈవో గీతారెడ్డిపై స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతో పాటు పలువురు అధికారుల నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే.. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదన్న భావన.. స్థానిక ప్రజల్లో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత కూడా ఈవో గీతారెడ్డి పనితీరుపై చాలాసార్లు మాజీ సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే.. ఆలయ పునర్నిర్మాణం సమయంలో.. ఈవోను మార్చటం సరికాదని.. దాని వల్ల ప్రజల్లోకి మంచి సందేశం వెళ్లదని కేసీఆర్‌ భావించినట్టు తెలిసింది.

14 ఏండ్లుగా లేని ధర్మకర్తల పాలక మండలి
యాదాద్రి టెంపుల్‌కు14 ఏండ్లుగా ధర్మకర్తల మండలి లేదు. వంశపారంపర్య ధర్మకర్త సహా 9 మంది సభ్యులు ఉండాల్సిన ధర్మకర్తల మండలి పదవీకాలం 2009లో ముగిసిపోయింది. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక సభ్యుల సంఖ్యను 14కు పెంచుతున్నట్టు ప్రకటించారు. పాలకమండలి ఏర్పాటుకు నాలుగుసార్లు నోటిఫికేషన్‌ ఇచ్చినా ఎవరినీ నియమించలేదు. దాదాపు రూ. 1200 కోట్లతో నాటి ప్రభుత్వం ఆలయ పునర్నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనుల కోసం యాదాద్రి టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వైటీడీఏ) ఏర్పాటు చేశారు. నిర్మాణ పనులను ఈ సంస్థే పర్యవేక్షించింది. కొత్త ప్రభుత్వం రావడంతో ప్రస్తుతం పాలకమండలి ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించిన వారితో పాటు ఇతర జిల్లాల లీడర్లు కూడా టెంపుల్‌ కమిటీలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

సామాన్యుల కష్టాలు
స్థానిక భక్తులకు రోజువారి దర్శనం లేకుండా కేవలం శనివారం మాత్రమే స్థానిక భక్తులు దర్శనానికి రావాలని, మిగతా రోజులలో మామూలు భక్తుల వల్లే రావాలని నిబంధనలు సైతం స్థానిక ప్రజలను ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె పదవీకాలం ముగిసిన తిరిగి పదవి అప్పగించడంతో ఇష్టారాజ్యంతో పలు నిబంధనలు వేధించి ప్రజలను, కింది సిబ్బందిని, భక్తులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పునర్నిర్మాణంలో స్థానికులకు నష్టం జరగకుండా చూడడంలో వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, టెంపుల్‌ ఈవో గీత విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. రోడ్ల విస్తరణ, రింగ్‌రోడ్డుతో స్థానికులు ఇండ్లు, షాపులు కోల్పోయారు. వ్యాపారాలు దెబ్బతిని ఆర్థికంగా కుదేలయ్యారు. షాపులు కోల్పోయిన వారికి తిరిగి నిర్మించి ఇస్తామని చెప్పినా ఇప్పటికీ ఇవ్వలేదు. కొండపైకి ఆటోలను నిషేధించడంతో వందలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఇక ఆలయ నిర్మాణంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పిందే తప్ప సామాన్య భక్తుల అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. గుట్ట మీదగానీ, గుట్ట కిందగానీ భక్తులకు కనీస వసతులు కల్పించలేదు. ముందు కోనేటిలో స్నానం చేసి దేవుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కానీ, గుట్టపైన కోనేరు లేకపోవడం సమస్యగా మారింది. ఇక గుట్ట మీద నిలువ నీడలేకపోవడంతో నర్సన్నను దర్శించుకోవాలంటే ఎండ, వాన, చలిని భరించాల్సి వస్తోంది. కొండపైన టాయిలెట్లు కూడా లేకపోవడంతో భక్తులు పడ్తున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు మొదటి ఘాట్‌రోడ్డు నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఎగ్జిట్‌ఘాట్‌ రోడ్డు నుంచే రాకపోకలు సాగుతున్నాయి. కల్యాణమండపం, సంగీత నిలయం నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అన్నదానసత్రం పనులు నత్తనడకన సాగుతుండడంతో దీక్షాపరుల మండపంలో భక్తులకు భోజనం పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం నుంచి ఫండ్స్‌ వస్తేనే ఈ పెండిరగ్‌ పనులు పూర్తికానున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు