Monday, April 29, 2024

మునుగోడు మొనగాడు ఎవరు..?

తప్పక చదవండి
  • ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే
  • మూడో స్థానానికి పరిమితం కానున్న కమలం పువ్వు

చౌటుప్పల్‌ : ఉప ఎన్నికలు జరగడం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో అభివృద్ధి బీఆర్‌ఎస్‌ పార్టీకే లాభం చేకూరుతుందన్నప్పటికీ , కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పుడు బీజేపీి సుమారు 87 వేల మెజార్టీ సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీ మారడంతో, బీజేపీి మూడో స్థానానికి పరిమితమయ్యేటట్లు కనిపిస్తుంది. ప్రధాన పోటీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వస్తాడు అనుకున్నప్పటికీ రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారడంతో బీజేపీ పరిస్థితి చెతికీల పడిపోయింది.

ప్రధాన పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్యే:
రాజగోపాల్‌ రెడ్డి వ్యక్తిగతంగా పార్టీ మారుతాడని అని ఉన్న, ప్రభుత్వ వ్యతిరేకత ముందు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లు మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్‌ వైపే సానుకూలంగా ఉన్నట్లు వ్యక్తం అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ని స్థాపించి ఉవ్వెత్తున ఉద్యమం చేసి, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ పార్టీగా ఉద్భవించి పార్టీలో పోటీ చేశారు. ఆది నుంచి ఉద్యమకారుడుగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి కేసిఆర్‌ తో ఉంటూ..ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడు. అనంతరం 2014 సంవత్సరంలో టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొం దాడు. అనంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ.. తనవంతుగా అనేక అభివృద్ధి పనులను చేపట్టాడు. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో పోటీలో ఉండి తన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు. నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న నిధులు కేటాయించడం లేదని, తన ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారు. అనంతరం 2022లో బై ఎలక్షన్లు రావడంతో.. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సుమారు 100 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఇతర నాయకులు వచ్చి ప్రచారం నిర్వహించగా కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి తన ప్రత్యర్థి అయిన రాజగోపాల్‌ రెడ్డి పైన 10,309 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అనంతరం కేటీఆర్‌ దత్తతతో 500కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి అభివృ ద్ధి చేసిన కూసుకుంట్లకు అసమ్మతి వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల, సెకండ్‌ క్యాడర్‌ వెళ్లి వేరే పార్టీలో చేరడంతో, కిందిస్థాయి నాయకులతో సఖ్యత లేకపోవడం వల్ల, బీఆర్‌ఎస్‌ పార్టీ రెండో స్థానానికి పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -

మూడో స్థానానికే బీజేపీి పరిమితం:
రాజగోపాల్‌రెడ్డి బై ఎలక్షన్‌లో బీజేపీలో చేరి కచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బిజెపి శ్రేణులు అనుకున్నాయి. కానీ మునుగోడు నియోజకవర్గంలో బిజెపి పార్టీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌ రెడ్డికి 86,697 ఓట్లు రాగా, తన ప్రత్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి 97,006 వచ్చాయి. కచ్చితంగా విజయం సాధిస్తుంది అనుకున్న బిజెపి శ్రేణులు నిరుత్సావ పడా ్డరు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్‌ రెడ్డి పై, కూసుకుంట్ల ప్రభాక ర్‌రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొన్ని రోజుల పాటు బిజెపి పార్టీలో ఉన్న రాజగోపాల్‌ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత అన్యుహంగా బిజెపి పార్టీని వీడి ,రాత్రికి, రాత్రే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మె ల్యే టికెట్‌ ఆశించిన చలమల్ల కృష్ణారెడ్డి మనస్థాపం చెంది ,బిజెపి శ్రేణులతో చర్చలు జరిపి బిజెపి మునుగోడు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్‌ తెచ్చుకోవడం చకచకా జరిగాయి. చలమల్ల కృష్ణారెడ్డి భారీగా రాజగోపాల్‌ రెడ్డి ఓట్లను చీల్చి గెలుస్తానని ప్రచారం చేసుకున్నాడు. కానీ, అనుకున్న స్థాయిలో సాధించలేక పోయిండు. బిజెపి పార్టీలో ఉండి 30 వేల ఓట్లు కూడా చీల్చలేక పోయిండు కాబట్టి కాంగ్రెస్‌పార్టీక ిగెలుపుఅవకాశంఎక్కువగా ఉంది.

పార్టీ మారిన అనతి కాలంలోనే అన్యుహంగా పుంజుకున్నా రాజగోపాల్‌ రెడ్డి:
భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన అనతి కాలములోనే తనపై ఉన్న వ్యక్తిగతంగా పార్టీ మారుతాడని వ్యతిరేకతను పోగొట్టిండు. కేసిఆర్‌ కు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, కేసిఆర్‌ పైన పోటీ చేయడానికి అయినా సిద్ధమని చెప్పాడు. ప్రభుత్వం పైన వ్యతిరేకంగా గాలివీయడంతో రాజగోపాల్‌ రెడ్డి గత ఇమేజ్‌ గాలికికొట్టుకుపోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు