Thursday, February 29, 2024

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపెవరిది ?

తప్పక చదవండి
  • సంచనం లేపుతున్న ప్రముఖ జ్యోతిష్య పండితులు రాఘవేంద్ర జోష్యం

రాజకీయాలలో తాము గెలవడం వేరు, తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా గవర్నమెంట్ ని ఫామ్ చేసే స్తాయిలో సీట్లను కైవసం చేసుకోవడం వేరు. రాజకీయాలలో వ్యక్తిగతంగా గెలిచి చక్రం తిప్పాలంటే జీవకారకుడైన బృహస్పతి ,మరియు ఆత్మ కారకుడు అయిన సూర్య భగవానుడి బలం జన్మ జాతకంలో బాగా వుండి ఎన్నికలు జరిగే సమయంలో గోచార గ్రహాలు కూడా అనుకూలించాల్సిన అవసరం ఉంటుంది.అదే సమయంలో నాయకులు తాము గెలవడం మాత్రమే కాకుండా తాము ప్రాతినిధ్యం వహించే పార్టీ తరపున అత్యధికమైన సీట్లను గెలవడం ద్వారా అధికారపీఠాన్ని అధిరోధించాలంటే వారికి కర్మ కారకుడైన శని తో పాటు కేతువు ,కుజుడు,శుక్ర గ్రహాల బలం అమితం గా వుందటంతో పాటు గా గోచర రవి ,కేతువు,బృగువు అనుకూలించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం తెలంగాణాలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది జ్యోతిష శాస్త్ర రీత్యా తెలియాలంటే ఆయా ప్రదాన పార్టీల తరపు నుండి పోటీ చేస్తున్నవారిలో కనీస 357 మంది అభ్యర్ధుల (119 * 3) జాతకాలను కులాంకుషం గా పరిశీలన చేయవల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణలో ప్రస్తుతం పోటీ చేస్తున్న వారిలో ఎక్కువ మందికి సంభందించిన జాతక వివరాలు అందుబాటులో లేని కారణం చేత మనం అతి పురాతనమైన కనీనిక జ్యోతిష పద్దతితోపాటు ఆధునిక పద్దతి అయిన ప్రశ్నా జ్యోతిషం ను అనుసరించి మరియు ఆయా వ్యక్తులు ఏ ప్రదేశంలో పోటీ చేస్తున్నారో ఆ ప్రదేశం తాలూకు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనుసరించి ఫలితాలను చెప్పే ఆస్ట్రో కాస్ట్రో గ్రఫీ (డా. జిమ్ లివిస్ )పద్దతిని కూడా అనుసరించి గనితాన్ని వేసి ఫలితాలను అంచనా వేయవలసి ఉంటుంది.

ఈ విధంగా అనేక రకాలైన జ్యోతిష పద్దతులలో గణించిన పిమ్మట తెలంగాణ లో అధికార పీఠం కోసం పోటీ పడే ప్రధానపార్టీలు,వాటి రాష్ట్ర స్తాయి అధ్యక్షుల మరియు(అందుబాటులో ఉన్న) అభ్యర్ధుల జాతకాలను పరిశోదించిన పిమ్మట 2023 సం”లో తెలంగాలో జరుగున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికమైన సీట్లు అనగా సుమారు 65 ( -/+ 5 ) కైవసం చేసుకోవడం ద్వారా అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పవచ్చు. ఇక బి ఆర్ ఎస్ పార్టీ 45 (-/+ 5) సీట్లు, యం ఐ యం పార్టీ 7 (-/+ 1 ) సీట్లు , బిజెపి 6 (-/+ 1 ) సాధించ బోతున్నాయని చెప్పవచ్చు .

- Advertisement -

ఎవరి గెలుపోటములు ఎలా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి చూపు కొందరు ప్రముఖులు ప్రతినిధ్యం వహిస్తున్న స్తానాలపై ఉందనేది కదనలేని వాస్తవం, అటువంటి స్ఠానాలపై ప్రత్యేకంగా చేసిన పరిశోధనా సారాంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేసున్నాను.అందులో ప్రధానం గా కెసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ లో మంచి మెజారిటీతో గెలుస్తున్నప్పటికిని, కామారెడ్డి లో మాత్రం గెలుపు వారిని వరించడం లేదనే చెప్పవచ్చు.బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి స్వంత నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్ది కృష్ణ యాదవ్ గారు సుమారు 6వేల ఓట్ల తేడా తో ఓడిపోబోతున్నారు. హుజూరా బాద్ లో ఈటెల రాజేందర్ గారు గెలవబోతున్నారు.దుబ్బాక నియోజక వర్గం లో బిజెపి పార్టీకి ఫలితాలు అంత ఆశాజనకంగా లేవనే చెప్పవచ్చు. ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరికొన్ని నియోజక వర్గాల ఫలితాలు వరుసగా ఈ విదంగా ఉన్నాయి.
గెలిచే వారిలో కొందరు ప్రముఖులు

కోడంగల్ : రేవంత్ రెడ్డి (INC)
కొరట్ల : దర్మపురి అర్వింద్,(BJP )
గోషామహల్ : రాజా సింగ్ (BRS)
నాగర్ కర్నూల్ : మరి జనార్ధన్ రెడ్డి (BRS)
సనత్ నగర్ : తలసాని శ్రీనివాస యాదవ్ (BRS)
చెన్నూర్ : వివేకానంద్ (INC)
మానుకొందుర్ : సత్యన్నారాయణ (INC)
మునుగోడు : రాజగోపాల్ రెడ్డి (INC)
పాలేరు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (INC)
మల్కాజ్ గిరి : మైనంపల్లి హనుమంతరావు (INC)
మేడ్చల్ : మల్లా రెడ్డి (BRS)
మహేశ్వరం : సబితా ఇంద్ర రెడ్డి (BRS) విజయ బావుటా ఎగురవేయబోతున్నారు

దాదాపు 20 సంవత్సరాల నుండి జ్యోతిష ,వాస్తు శాస్త్రాలలో విశేషమైన పరిశోధనలు చేస్తున్న జ్యోతిష పండితులు రాఘవేంద్ర గారు ఉత్తరాంద్ర లోని పలు విధ్యాసంస్థలలో జ్యోతిష ,వాస్తు శాస్త్రాల పాఠాలు బోధించడం పాఠకులకు విధితమే .

గతంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ ,బీహార్ ,వెస్ట్ బెంగాల్,కర్నాటక,తమిళనాడు, ఛత్తీస్ గర్ ,జార్ఘండ్, ఆంద్రప్రదేశ్ ,తెలంగాణ,జరిగిన ఎన్నికల గురించి జ్యోతిష పండితులు రాఘవేంద్ర గారు చెప్పిన ఫలితాలు అక్షర సత్యాలు గా మారడం పాఠకులకు తెలిసిన విషయమే.

ఆచార్య రాఘవేంద్ర
ప్రముఖ జ్యోతిష,వాస్తు ,సంఖ్యా శాస్త్ర నిపుణులు మరియు బోధకులు
raghavindraa81@gmail.com

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు