Tuesday, May 14, 2024

ఇక ఫోన్‌ నంబర్‌ లేకున్నా కూడా వాట్సాప్‌!

తప్పక చదవండి

న్యూఢిల్లీ : వాట్సాప్‌ ఖాతా ఫోన్‌ నంబర్‌తో అనుసంధానమై ఉంటుంది. ఒకవేళ ఆ ఫోన్‌ నంబర్‌ యాక్టివ్‌ లేకపోతే, ఫోన్‌ ఎక్కడైనా పోతే.. దాంట్లో ఉన్న వాట్సాప్‌ ఖాతాను కూడా యూజర్‌ కోల్పోయినట్టే. ఈ సమస్యను తొలిగించేందుకు ఫోన్‌నంబర్‌ అవసరం లేకుండా వాట్సాప్‌ సేవల్ని పొందే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు కంపెనీవర్గాలు తెలిపాయి. ఫోన్‌ నంబర్‌తో కాకుండా యూజర్ల ఈ`మెయిల్‌ వెరిఫికేషన్‌తో వాట్సాప్‌ ఖాతాను అనుసంధానం చేసే పక్రియపై కంపెనీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. వాట్సాప్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌తో మరిన్ని ఫీచర్స్‌, గోప్యతపై మెరుగైన పద్ధతుల్ని తీసుకురాబోతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు