Sunday, May 19, 2024

మెడికల్‌ కళాశాల ముసుగులో ఉద్యోగాల పేరుతో టోకరా

తప్పక చదవండి
  • 42 మంది బాధితుల వద్ద, రూ.63.60 లక్షల వసూళ్లు..
  • జి.ఎస్‌ సెక్యూరిటీ మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ పేరుతో నియామకాలు..
  • మంత్రి జగదీష్‌ రెడ్డికి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.బాధితులు..
  • మెడికల్‌ కళాశాల ముందు బాధితుల ధర్నా, న్యాయం చేయాలని డిమాండ్‌

సూర్యాపేట : చేసి మోసం చేసిన అటెండర్‌ షెక్‌ నవీన్‌ పాషాపై (అలియాస్‌ నబి భాష) చర్యలు తీసుకోవాలని బాధితుడు సతీష్‌ యాదవ్‌ బుధవారం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ముందు మరికొంతం కొంతమంది భాదితులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ మెడికల్‌ కళాశాల గేటు ఎదుట ఆయన మాట్లాడుతూ కళాశాలలో అటెండర్‌ గా పని చేస్తున్న నవీన్‌ పాషా నేను ‘‘జి.ఎస్‌ సెక్యూరిటి మ్యాన్‌ పవర్‌’’ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ నిర్వహకులు మధుసూదన్‌ రెడ్డి వద్ద పిఎ పని చేస్తున్నాని, మీకు మెడికల్‌ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తాని నమ్మించి ఒక్కో వ్యక్తి నుండి రూ. 2 లక్షల చొప్పున 42 మంది వద్ద ఒప్పుందం చేసుకున్నట్లు తెలిపారు. విడతల వారిగా బాధితులు అందరు నవీను పాషాకు రూ. 63.60 ల నగదు అందజేసినట్లు పేర్కొన్నారు.

ఆ తరువాతా తమకు ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించగా మెడికల్‌ కళాశాల ప్రారంభం ఆలస్యమవుతుందని సాకు చూపుతు కాలయాపన చేశారని తెలిపారు.మెడికల్‌ కళాశాల ప్రారంభం అయ్యాక నిలదీయడంతో ఏజెన్సీ వారికి, కళాశాల ప్రిన్సిపల్‌ గోడవలు జరుగుతున్నాయని సద్దుమణిగాక ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినట్లు తెలిపారు. ఈ విషయంపై మంత్రి జగదీష్‌ రెడ్డిని కలవడం జరిగిందని మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి ఇంతవరకు న్యాయం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఫిర్యాదు చేసిన ఏలాంటి న్యాయం జరగలేదని అన్నారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు, అధికారులు నవీన్‌ పాషాపై చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బాధితులు మహేశ్వరి, శ్రీలేఖ, ఆశ తదితరులు ఉన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు