Sunday, June 23, 2024

బీఆర్‌ఎస్‌ కి షాక్‌..

తప్పక చదవండి
  • బీఎస్పీలో చేరిన పెద్దకంజర్ల అంబేద్కర్‌ యువజన సంఘం..

పటాన్‌ చెరు : పటాన్‌ చెరు నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌ లు తగులుతున్నాయి. పటాన్‌ చెరు మం డలం పెద్ద కంజ ర్లకు చెందిన అంబెడ్కర్‌ యువజన సంఘనికి చెందిన 30 మంది సభ్యులు బీఅర్‌ఎస్‌ కు రాజీనామా చేసి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఎస్పీ తోనే బహుజన రాజ్యాధికారం సాధ్యపడుతుందని తెలిపారు. నీలం మధు ముదిరాజ్‌ అనేక సంవత్సరాలు గా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల కోసం పని చేస్తున్నాడని పేర్కొన్నారు. నీలం మధు చేస్తున్న సేవలకు , బహుజన సమాజ్‌ పార్టీ విధానాలకు ఆకర్షితులమై బీఎస్పీ లో చేరినట్లు వెల్లడిరచారు. తామంతా బీఎస్పీ పార్టీ గెలుపు లో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి నీలం మధు ముదిరాజ్‌ ని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు