Sunday, May 5, 2024

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

తప్పక చదవండి
  • బ్రాహ్మణ సదన్‌ నిర్మాణానికి ఎకరా భూమి ఇచ్చిన
    డాక్టర్‌ రామయ్య కుటుంబ సభ్యులకు జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు

సూర్యాపేట : 2014కు ముందు పాలించిన పాలకుల హయాం లో నిరాదారణ కు గురైన బ్రాహ్మణులను ,రైతులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆరే అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. సూర్యాపేట 5వ వార్డు దురాజ్‌ పల్లి సమీపంలో రూ 2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్‌ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రులు ఇంద్ర కరణ్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ, బ్రాహ్మణ సమాజ సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారికోసం ఒక కేంద్రం ఏర్పాటు కావడం దేశంలోనే గోపనపల్లి తరువాత సూర్యాపేట దే తరువాతి స్థానం అన్నారు. అన్ని రంగాల మాదిరే బ్రాహ్మణ సంక్షేమంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగ యాదవ్‌, బ్రాహ్మణ పరిషత్‌ చైర్మన్‌, ప్రభుత్వ సలహాదారులు కె.వి. రమణాచారి, బ్రాహ్మణ పరిషత్‌ సభ్యులు సముద్రాల వేణుగోపాల చారి, ముఖ్యమంత్రి కెసిఆర్‌ చీఫ్‌ పిఆర్‌ఓ, బ్రాహ్మణ పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ జ్వాలా నరసింహారావు, జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌ గౌడ్‌ , బ్రాహ్మణ సంఘాలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు