Saturday, May 18, 2024

ఆదాబ్‌ కథనాలకు స్పందించిన అధికారులు..

తప్పక చదవండి
  • సూర్యాపేట సమగ్ర శిక్ష నిధుల గోల్‌ మాల్‌ వ్యవహారంలో
    కాంట్రాక్టు ఉద్యోగి అనుసూరి రమేష్‌ని తొలగిస్తూ ఉత్తర్వులు..
  • ఈ వ్యవహారంపై పలు కథనాలు ప్రచురించిన ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’..
  • బాల బాలికల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసిన ఉద్యోగి..
  • అతన్ని విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు..

హైదరాబాద్‌ : సూర్యాపేట సమగ్ర శిక్ష అభియాన్‌ లో జరిగిన నిధుల గోల్‌ మాల్‌ గురించి, ఆదాబ్‌ హైదరాబాద్‌ పలు కథనాలు ప్రచురించిన విషయం విదితమే.. కాగా ఈ కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు..

కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ దేవసేన ఈ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు.. కాగా కమిటీ పూర్వాపరాలు విచారించి, సదరు కాంట్రాక్ట్‌ ఉద్యోగి అనుసూరి రమేష్‌ అక్రమాలకు పాల్పడ్డాడని నివేదిక సమర్పించింది.. నివేదిక ఆధారంగా ఆ ఉద్యోగిని విధులనుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.. ( ఆర్‌.సి. నెంబర్‌ : 6666 /సి1/ ఎస్‌.ఎస్‌.- ఎఫ్‌.డబ్ల్యు. /2023 ).. అతగాడు కాజేసిన నిధులను కూడా రికవరీ చేయడం జరిగింది.. కనుక ఈ అవినీతిని క్రిమినల్‌ నేచర్‌ గా భావించి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసిన రమేష్‌ పై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని పలువురు కోరుతున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు