Tuesday, May 14, 2024

ఆలోచింపజేస్తున్న బీఎస్పీ మేనిఫెస్టో..

తప్పక చదవండి
  • వికారాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా బీఎస్పీ అభ్యర్థి ప్రచారం
  • బీఎస్పీని ఆదరిస్తే విద్యా వైద్యం పూర్తిస్థాయిలో ఉచితం
  • ఒక్క అవకాశం ఇచ్చి చూడండి… అభివృద్ధి చేసి చూపిస్తాం
  • వికారాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గొర్ల కాడి క్రాంతి కుమార్‌

వికారాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : వికారాబాద్‌ నియోజక వర్గ బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. క్రాంతి కుమార్‌ ఊరూరా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ధరూరు మండలంలోని ధర్మాపూర్‌, కొండాపూర్‌, సోమవరం, నర్సాపూర్‌, గడ్డమీది గంగారం, రుద్రారం, గట్టేపల్లి, గట్టేపల్లి తండా, రాంపూర్‌ తండాలలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో బీఎస్పీ అభ్యర్థి గొర్ల కాడి క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు మనల్ని పాలించిన పార్టీల ద్వారా మన బ్రతుకులో ఎలాంటి మార్పు రాలేదన్నారు.ప్రలోభాలకు గురి చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని ఎన్నికల సమయంలో మీ చుట్టూ తిరుగుతున్నరని ప్రజలకు వివరించారు.ఇంకెవరి మాటలు నమ్మకండి,అన్ని పార్టీలకు బుద్ధి చెప్పేలా ఒక్క సారి ఏనుగు గుర్తుపై ఓటేసి చూడండి..సుభిక్షమైన పాలన అందించేందుకు సిద్దంగా ఉన్నామని బరోసా ఇచ్చారు.

ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇయ్యని విధంగా బీఎస్పీ బహుజన బరోసా పేరుతో..1.యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు. మహిళలకు 5 లక్షల ఉద్యో గాలు. షాడో మంత్రులుగా విద్యార్థి నాయ కులు.2. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌, ప్రతి మండలం నుంచి ఏటా 100 మంది విద్యార్థులకు విదేశీ విద్య, డేటా, ఏఐ, కోడిరగ్‌ లో శిక్షణ.3. ప్రతి పంట కనీస మద్దతు ధరతో కొనుగోలు. రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు కచ్చితమైన ప్రభుత్వ రాయితీ. ధరణి పోర్టల్‌ రద్దు. 4. మహిళా కార్మికులు, మహిళా రైతులకు ఉచిత వాషింగ్‌ మెషీన్‌, స్మార్ట్‌ ఫోన్‌, డ్రైవింగ్‌లో శిక్షణ. అంగన్‌ వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగులు క్రమబద్దీకరణ. మహిళా సంఘాలకు ఏటా రూ. 1 లక్ష.5. హాస్టల్‌, ఆహారం, ఉచిత వైద్య సేవలు. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు. 6. పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీ, రోజు కూలి రూ. 350 కి పెంపు. కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్య, జీవిత భీమా 7. ప్రతి కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య బీమా ప్యాకేజీ. ఏటా రూ. 25,000 కోట్లతో పౌష్టికాహార, ఆహార బడ్జెట్‌ .8. రూ. 5,000 కోట్ల నిధితో గల్ఫ్‌ కార్మికులకు సంక్షేమ బోర్డు. వలస కార్మికులకు వసతి, కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు. 9. ఇల్లు లేని వారికి 550 చదరపు గజాల ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునే వారికి రూ. 6 లక్షలు సహాయం. ఇంటి పునర్నిర్మా ణానికి రూ.1 లక్ష సహాయం. 10. భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, మహిళల పేరిట పట్టా తప్పనిసరి అందించి తీరుతమని,ఒకే ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడండి అని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ ముఖ్య నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు