Sunday, May 19, 2024

మైనార్టీ గురుకుల సోసైటీలో అవినీతి కంపు

తప్పక చదవండి
  • పోస్టుకో రేట్.. వస్తువుకింత కమీషన్
  • ఇతర వెల్ఫేర్లలో లేని కొత్త రకం పోస్టులు
  • అంగట్లో జెల్ల-పరకల్లా అమ్మబడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
  • హెడ్ ఆఫీసులో 80 శాతం స్టాఫ్ ఔట్ సోర్సింగ్ వాళ్లే
  • వీళ్లను కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లని పరిస్థితి
  • ఆడిటింగేే ఓ పెద్ద బోగస్ యవ్వారంగా మారిన వైనం
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగి లతీఫే ఆఫీస్ హెడ్..!
  • ఆయనకే వత్తాసు పలికిన కారదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్
  • బీఆర్ఎస్ సర్కార్ లో పూర్తిగా భ్రష్టుపట్టిన మైనార్టీ గురుకుల వ్యవస్థ
  • కొత్త సర్కార్ నజర్ పెడితే అసలు లీలలు బయటకు వచ్చే ఛాన్స్

హైదరాబాద్ : తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన కర్షన్ కంపు వాసనలు ఇప్పటికీ బలంగానే ఉన్నాయి. గురుకుల కార్యదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ అండదండలతో వారి తాబేదారు లతీఫ్ చాన్నాళ్లుగా రెచ్చిపోతున్నారు. టెండర్ కు ఒక లెక్క, ఔట్ సోర్సింగ్ జాబ్ కు మరో లెక్క.. ఇతరత్రా యవ్వారాలకు మరో లెక్క అన్నట్లు సాగుతోంది యవ్వారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో దొరికిన విచ్చలవిడి తనంతో ఇష్టారాజ్యంగా ఇక్కడ కర్షన్ వ్యవహారాలు ఇప్పటికీ సాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనార్టీ సామాజిక వర్గాలకు మెరుగైన విద్యా వ్యవస్థను అందించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం 2016లో తెలంగాణ మైనార్టీ గురుకులాలకు అంకురార్పణ చేసింది. అందులో భాగంగా ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాల పాఠశాలలు రన్ అవుతున్నాయి. ఇందులో 107 బాలుర, 97 బాలికల పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 1,30,560 వరకు విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఎంతో బృహాత్ లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఈ పాఠశాలల్లో కేసీఆర్ సర్కార్ హయాంలో అవినీతి ఊడలూనుకుంది. అదే కంపు వాసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీ గురుకుల సోసైటీ నిర్వాహణ, స్టాఫ్ ఎంపికలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది.

- Advertisement -

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మివేత..!

గురుకుల స్థాపన తర్వాత గురుకుల పాఠశాల నిర్వాహణ కోసం అవసరమైన స్టాఫ్ ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయి. మైనార్టీ గురుకుల సోసైటీ మాదిరే ప్రభుత్వం ఒకే సమయంలో ఇతర సోసైటీలను కూడా ప్రారంభించింది. ట్రైబర్, సోషల్, జ్యోతిబాపులే వంటి గురుకుల పాఠశాలను స్టార్ట్ చేసింది. కానీ, వాటిలో వేటిలోనూ లేని విధంగా మైనార్టీ గురుకుల సోసైటీల్లోనే కొత్త రకమైన పోస్టులను ఎంపిక చేసుకోవడం గమనార్హం. ఇందుకోసం గురుకుల కార్యదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకె ఖాన్ తమకు అనుకూలంగా ఉండే లతీఫ్ అనే ఓ తాబేదారును తెచ్చి పెట్టుకున్నారు. ఈ లతీఫ్ ద్వారానే కార్యదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకేే ఖాన్ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. లతీఫ్ ప్రతీ పనికి సంబంధించి తీసుకున్న సోమ్ములో ఏకే ఖాన్, షఫీఉల్లాకు ఆమ్యామ్యాలు అందేవనే ప్రచారముంది.

టెండర్లలో గోల్ మాల్ వ్యవహారాలను మైనార్టీ గురుకులాల్లో జరగడం గమనార్హం. అందులో భాగంగానే ఒక రిటైర్డ్ అయిన వ్యక్తికి గతంలో విజిలెన్స్ పోస్టు దక్కింది. అది కూడా నోటిఫికేషన్ లేకుండానే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వడం విస్మయం కల్గిస్తోంది. దీనితో పాటు ప్రిన్సిపల్, అకాడమిక్, ఆర్ఎల్సీ పోస్టులను కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఎంపిక చేసుకోవడం గమ్మతైన వ్యవహారంగా కనిపిస్తోంది. ఇందుకోసం లతీఫ్ భారీగా ముడుపులు నొక్కేసి.. పోస్టింగ్స్ ఇచ్చేశారు. అయితే వేరే సోసైటీల్లో ఇన్ని పోస్టులు కానీ.. ఈ పద్ధతులు కానీ.. లేకపోవడం గమనార్హం. వాస్తవానికి లతీఫ్ కు విద్యా వ్యవస్థపై ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ.. ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఆయనను దొడ్డిదారిలో డైరెక్టర్, కార్యదర్శులు ఒక అకాడమిక్ హెడ్ పోస్టులో కూర్చోబెట్టడడం విశేషం.

టెండర్ ను బట్టి కమీషన్..!
ప్రతీ ఏడాది మైనార్టీ స్కూల్స్ లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్, షూస్ అందిస్తుంటారు. ఇందుకోసం ప్రతీ సంవత్సరం టెండర్లకు కాల్ ఫర్ చేస్తుంటారు. అయితే వీటిలోనూ లతీఫ్ కార్యదర్శి షఫీఉల్లా, అప్పటి డైరెక్టర్ ఏకే ఖాన్ సపోర్ట్ తో రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్ టెండర్లలో భారీగా కమీషన్లు నొక్కేసినట్లు సమాాచారం. అంతేకాక ఈ టెండర్లు కూడా షఫీ ఉల్లా, ఏకే ఖాన్ లెటర్స్ ఇచ్చిన వారికే దక్కినట్లు మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రచారముంది. ఈ విషయంలో లతీఫ్ కేవలం బిల్ల బంట్రోతు పని మాత్రమే చేసేవారని తెలుస్తోంది. అయితే అప్పట్లో ఈ అక్రమాలు ఎంఐఎం ఎమ్మెల్యే, చంద్రాయణగుట్ట శాసన సభ్యులు అక్బరుద్దీన్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడం విశేషం. అయితే ఈ యవ్వారం బయటకు వస్తే పెద్ద రచ్చే అయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో.. అక్బర్ ను బామాలో.. బ్రతిమాలో మ్యానేజ్ చేసుకున్నట్లు సమాచారం.

బినామీ కంపెనీ ద్వారా ఆడిటింగ్

మరోవైపు ఆడిటింగ్ లోనూ మైనార్టీ గురుకులాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరగడం విశేషం. వాస్తవానికి గురుకుల సోసైటీల సంవత్సరీక ఆడిటింగ్ శాఖ ద్వారా జరిపించడం ఉత్తమం. కానీ,మన మైనార్టీ గురుకులంలోని అవినీతి జలగలు ఆడిటింగ్ యవ్వారాన్ని ఎన్జీ రావు అనే ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం అందరిని విస్మయానికి గురి చేసింది. దీని ద్వారానే మైనార్టీ గురుకులాలకు సంబంధించిన స్కూల్స్, కళాశాలల యొక్క ఆడిటింగ్ చేయించారు. అయితే వీరిని చాలా వరకూ మ్యానిఫ్యులేషన్ చేసినప్పటికీ.. ప్రతీ స్కూల్లో రూ.2 లక్షల వరకూ రిమార్క్స్ బయటపడడం కొసమెరుపు. ఈ లెక్కన 204 గురుకుల పాఠశాల్లలో 2016 సంవత్సరం నుంచి లెక్కిస్తే కొన్ని వందల కోట్ల అవినీతి జరిగినట్లు అర్థమవుతోంది. ఇందుకోసం తప్పుడు బిల్లులు, దొంగ ఓచర్లు క్రియేట్ చేసి డబ్బులు నొక్కేసినట్లు ఆడిటింగ్ లో బహిర్గతం అయ్యింది.

ఆర్టీఐ కమిషనర్ ను మ్యానేజ్ చేస్తున్న వైనం

ఇంకోవైపు రాష్ట్ర మైనార్టీ ఆఫీస్, సోసైటీలకు వచ్చే ఆర్టీఐ దరఖాస్తులను సిబ్బంది అస్సలు లెక్కచేయడం లేదనే విమర్శలున్నాయి. ఏకంగా రాష్ట్ర కమిషనర్లనే మ్యానేజ్ చేసుకొని వారికి అవసరమైన ఆమ్యామ్యాలు సమర్పించుకొని ఏ సమాచారాన్ని సరిగా ఇవ్వకపోవడం విశేషం. ఈ విషయంలో చాలామంది రాష్ట్ర కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తులు వేయడమే వెస్ట్ అనే నిర్ణయానికి వచ్చేశారు. ఇక ఆర్టీఐ దరఖాస్తులనే కాకుండా విజిలెన్స్ ఇచ్చిన నివేదికలు కూడా బుట్టదాఖలయ్యాయి. అటు గతంలో జాతీయ మైనార్టీ కమిషన్ తెలంగాణ మైనార్టీ గురుకుల సోసైటీ రాష్ట్ర కార్యాలయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తేల్చింది. అప్పట్లో సుమారు 27 మంది ఉద్యోగులను విచారణ చేయగా.. రాష్ట్ర మైనార్టీ గురుకులాల్లో అవినీతి జరిగినట్లు తేలింది. పైసలు ఇచ్చిన వారికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు దక్కినట్లు విచారణలో బయటపడింది. కానీ, ఇప్పటి వరకు కమిషన్ విచారణ ఆధారంగా ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం గమ్మత్తుగా ఉంది.

హెడ్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ వాళ్లదే రాజ్యం

ఇక మైనార్టీ గురుకులాల రాష్ట్ర కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా కొనసాగుతుంది. ఇక్కడ వీళ్లు చెప్పిందే వేదం.. చేసిందే శాసనం. స్టేట్ ఆఫీసులో మొత్తం 80 శాతం ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ వాళ్లే ఉండడం విస్మయం కల్గిస్తోంది. ఇది చాలదన్నట్లు మిగతా వాళ్లు డిప్యూటేషన్ పై వచ్చి ఇక్కడ తిష్ట వేయడం గమనార్హం. వీళ్లు ఇక్కడే చాన్నాళ్లుగా పాతుకుపోవడం విశేషం. మరోవైపు ఔట్ సోర్సింగ్ పద్ధతిన వచ్చిన వారి హవా ఇక్కడ సాగుతున్నందున వీరిని కాదని ఒక్క ఫైలు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడం మైనార్టీ గురుకులాల్లోని వీరి ఆజామాయిషీకి అద్దం పడుతోంది. అయితే రాష్ట్ర మైనార్టీ గురుకుల సోసైటీలో కొనసాగుతున్న ఈ అవినీతి లీలలపై కొత్తగా కొలువుదీరిన సర్కార నజర్ పెడితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అప్పుడు కాస్తలో కాస్తైనా.. మైనార్టీ గురుకుల రాష్ట్ర కార్యాలయం, సోసైటీల్లో వెల్లునుకుపోయిన అవినీతిని వదులుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు